ఇదేం డ్యాన్స్, బాబోయ్.. గ్రావిటీనే ఓడించిన ఆంటీలు.. వీడియో చూస్తే..!

ట్రెడిషనల్ డ్యాన్స్ నుంచి వెస్ట్రన్ డ్యాన్స్‌ల వరకు మీరు ఇప్పటికే ఎన్నో డ్యాన్స్‌లు చూసే ఉంటారు.కానీ మీరు ఇంకా చూడాల్సిన డ్యాన్స్‌లు ఎన్నో ఉన్నాయి.

 Theres Aunties Defies Gravity While Dancing, Watch Viral Video , Aunties Dance,-TeluguStop.com

వాటిలో కొన్ని చాలా అద్భుతంగా అనిపిస్తే మరికొన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.అయితే ఇప్పుడు రెండో రకానికి చెందిన ఒక ఫన్నీ డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు.ఈ ఫన్నీ వీడియో @videonation.

teb ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.రీసెంట్‌గా షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే వేలల్లో లైక్స్, వ్యూస్ వచ్చాయి.

ఈ క్లిప్ ఓపెన్ చేస్తే మనకు ముగ్గురు మహిళలు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.వీరందరూ రెడ్ శారీలు కట్టుకుని చాలా ఊపుతో స్టెప్స్ వేస్తున్నారు.వీరిలో మరింత ఉత్సాహం పెంచేందుకు అక్కడే ఉన్న చాలా మంది చప్పట్లు కొడుతూ ఉన్నారు.ఈ ముగ్గురు మహిళలు చాలా ఫన్నీ డ్యాన్స్ చేయడం అందరి చేత నవ్వులు పూయించింది.

డోల్ బీట్‌కు తగినట్లుగా వీరు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ స్టెప్స్ వేశారు.ఈ క్రమంలో ఈ ఆంటీలు గాల్లో తెలియాడినట్టుగా కనిపించింది.

ఈ ఆంటీలు ఎవరూ చేయని సరికొత్త డ్యాన్స్ మూవ్‌లు చేస్తూ గురుత్వాకర్షణను ఓడించి గాల్లో తేలి ఆడినట్టు కనిపించారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.వీరి విషయంలో గ్రావిటీ లేదా గురుత్వాకర్షణ శక్తి ఎక్కడికి పోయింది? ఈ మాస్ ఆంటీలు జీరో గ్రావిటీ డ్యాన్స్‌తో మామూలుగా అదరగొట్టలేదు కదా అని కామెంట్ చేస్తున్నారు.వామ్మో న్యూటన్ ఈ డ్యాన్స్ చూస్తే మరో సిద్ధాంతం రాసేస్తాడని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ డ్యాన్స్ ఎక్కడ, ఎప్పుడు చేశారనేది తెలియరాలేదు.బహుశా ఇది నేపాల్ దేశంలో అయ్యుండొచ్చు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ ఆంటీలను మైకల్ జాక్సన్ తో కూడా కొంతమంది పోల్చుతున్నారు.స్మూత్ క్రిమినల్ లో జాక్సన్ ముందుకు వంగి కింద పడకుండా.

బయో మెకానికల్‌గా సాధ్యం కాని మూవ్ చేస్తాడు.అలాంటి గ్రేట్ మూవ్‌తో ఈ మహిళల స్టెప్పులను నెటిజన్లు పోలుస్తున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube