తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
తనను తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తమపైనే కేసులు నమోదు చేశారని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది.ఈనెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు
బిజెపి ,వైసీపీ లపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు.బిజెపి, వైసిపి బంధం చాలా అన్యోన్యంగా ఉందని, తల వంచి మెడవుంచి జగన్ మోదీ జపం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు.రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు కడపలో జగన్ పర్యటిస్తారని అధికారులు తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఏపీలో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.
ఏపీలో నేటి నుంచి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.ఈనెల 12 ,15 ,17 తేదీలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.
నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాలు నిర్వహించనున్నారు. నేడు బిజెపి జాయినింగ్ కమిటీ తొలి భేటీ జరగనుంది.బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
నేడు కిసాన్ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేటితో ఇంటర్ రీ వాల్యుయేషన్ గడువు ముగియనుంది.
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణానది యజమాని బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదన పై లేఖలో అభ్యంతరం తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు.
హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదరులు చేయడం కలకలం రేపింది.పాతబస్తీ సంతోష్ నగర్ ప్రాంతంలో మనోహర్ హుస్సేన్ అనే వ్యక్తి ఎన్ ఐ ఏ బృందం అదుపులోకి తీసుకుంది.
పెగాసిస్ హౌస్ కమిటీ సమావేశం ముగిసింది హోం ఐటీ శాఖల నుంచి హౌస్ కమిటీ సమాచారం సేకరించింది.ఈ క్రమంలో డేటా చౌర్యం జరిగిందని కమిటీ నిర్ధారణకు వచ్చింది.
మావోయిస్టు ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు పై హైకోర్టులో విచారణ జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy