న్యూస్ రౌండప్ టాప్ 20

1.త్వరలో రైతు రుణమాఫీ

  త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు.

 

2.డిగ్రీ పరీక్షలపై జోక్యం చేసుకోలేము: హైకోర్టు

  డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది తెలంగాణలో డిగ్రీ పరీక్షల పై హై కోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా దీనిపై కోర్టు ఈ విధంగా స్పందించింది. 

3.151 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీసులో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( ఏపేపీ) పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

4.కలెక్టర్ అధికారులపై మంత్రి ఆగ్రహం

  నిధులు ఉపయోగించడం లేదంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ ,అధికారులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

5.  9 వరకు ఎంసెట్ దరఖాస్తులు తప్పుల సవరణ

ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.ఈ నెల 9 వరకు వాటిని సరి చేసుకోవాలని చెప్పారు. 

6.నీట్ జేఈఈ కోసం కోట నిపుణుల స్టడీ మెటీరియల్

  ఇంటర్ తో పాటు నీట్, జేఈఈ ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం రాజస్థాన్ లోని కోట నిపుణులు రూపొందించిన స్టడీమెటీరియల్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ నీట్ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు. 

7.కేంద్ర మంత్రులకు జగన్ లేఖ

  ఏపీ సీఎం జగన్ కేంద్ర జల శక్తి మంత్రి శాఖ మంత్రి షేకావత్పర్యావరణ మంత్రి జవదేకర్ కు లేఖ రాశారు. 

8.ఎమ్మెల్యే ఆర్కే రాజధాని దళిత జేఏసీ ఆగ్రహం

Advertisement

  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై రాజధాని దళిత జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.మాజీ సీఎం మంత్రి నారాయణ, కొందరు ఉన్నతాధికారులు పై ఆరోపణలు చేయడం రాజధాని పై మరో కుట్ర అన్నారు. 

9.ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు

  ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో ప్రభుత్వం మార్పులు చేసింది.తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు కర్ఫ్యూ సడలింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

10.ఇసుక పాలసీ పై రఘురామ లేఖ

  ఏపీ లో ఇసుక పాలసీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు లేఖ రాశారు. 

11.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.ఆదివారం తిరుమల శ్రీవారిని 18,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 

12.నేడు కోవిడ్ పై జగన్ సమీక్ష

  ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

13.7న జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 7వ తేదీన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. 

14.పాపికొండలు విహార యాత్ర ప్రారంభం

  పాపికొండలు విహార యాత్రకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 

15.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

16.ఎమ్మెల్యేలకు కొత్త ల్యాప్ టాప్ లు

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

  రాష్ట్ర శాసనసభ వ్యవహారాలన్నిటిని డిజిటలైజేషన్ చేయడానికి రంగం సిద్ధమైంది.ఈమేరకు శాసన సభ్యులు అందరికీ కొత్త ల్యాప్ టాప్ పంపిణీ చేయనున్నారు. 

17.ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ఎంపీ అసదుద్దీన్ విమర్శలు

  ముస్లింల పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ మస్లీజ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

18.సలోని హీరోయిన్ గా కొత్త సినిమా

Advertisement

  రావణ్ హీరోగా, మర్యాదరామన్న సేమ్ సలోని హీరోయిన్ గా  ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. 

19. రామచంద్రపురం టీజర్ ఆవిష్కరణ

  ప్రశాంత్ మడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రామచంద్రపురం ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,320   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,320.

తాజా వార్తలు