న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.కోల్ కతా ఓటమి : షారూక్ క్షమాపణలు

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో తమ జట్టు ప్రదర్శన పరిచిందని కోల్ కతా నైట్ రైడర్స్  సహా యజమాని షారూక్  అన్నారు.

దీనిపై అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

2.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై లోకేష్ ప్రమాణం

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం లేదని ,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలిపిరిలో వెంకటేశ్వర స్వామి పాదాలు ప్రమాణం చేశారు.

3.చంద్రబాబు పై రాళ్ల దాడి జరగలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు పై రాళ్ల దాడి జరగలేదని ఏపీ హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు.

4.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 2,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,84,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.కరోనా కంటే కెసిఆర్ వైరస్ డేంజర్ : రేవంత్

కరోనా వైరస్ కంటే కెసిఆర్ వైరస్ డేంజర్ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

7.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 4,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.నేడు పలు జిల్లాల్లో వర్ష సూచనలు

రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

9.కేసీఆర్ కు జానారెడ్డి సవాల్

Advertisement

ఎల్ ఎల్ సీ -2 లో ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ నిరూపిస్తే తాను ఉప ఎన్నికల వారి నుంచి తాను తప్పుకుంటాను అంటూ జానారెడ్డి సవాల్ విసిరారు.

10.జగన్ రెడ్డి ఇక్కడికి ఎందుకు రావడం లేదు : లోకేష్

వైఎస్ వివేకా హత్య కేసులో తనకు ఏ సంబంధం లేదని ఈరోజు తిరుమలలోని అలిపిరి వద్ద ప్రమాణం చేసిన లోకేష్ జగన్ రెడ్డి ఇక్కడకు ప్రమాణం చేసేందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

11.తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్ టూర్

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.గురువారం ఉదయం 10 గంటలకు అనపర్తి మండలం లో లోకేష్ పర్యటించనున్నారు.

12.కరోనా వ్యాక్సిన్ ఖర్చు భరించనున్న అమేజాన్.

అమెజాన్ ఇండియా తన ఉద్యోగులతో పాటు,  అనుబంధ సంస్థల సిబ్బంది సుమారు 10 లక్షల మందికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించింది.

13.అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం స్పష్టం చేసింది.

14.బ్యాంక్ ఆఫ్ బరోడా లో 511 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన 511 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

15.హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం : కేసీఆర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

16.హైదరాబాదులో షర్మిల నిరాహారదీక్ష

ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులో వైయస్ షర్మిల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయబోతున్నారు.

17.అఖిలేష్ యాదవ్ కు కరోనా  పాజిటివ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

18.భారత్ లో పూర్తి లాక్ డౌన్ విదించం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

19.తెలంగాణా కు 4.60 లక్షల టీకాలు

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 4.60 లక్షల టీకాలు కేంద్రం నుంచి వచ్చాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,850 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,850.

Advertisement

తాజా వార్తలు