న్యూస్ రౌండప్ టాప్ - 20

1.మొసలి దాడిలో వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం  ఇసోజీ పేట లో దారుణం చేసుకుంది.

మంజీరా తీరంలో పశువులు కడగడానికి వెళ్లిన కాపరి గొల్ల రాములను  ముసలి నీళ్ళల్లో కి ఈడ్చుకు వెళ్లింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు మృతి చెందారు.

2.వనదేవతల గద్దెలు మూసివేత

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు దేవాదాయశాఖ రాజేంద్ర తెలిపారు.

3.షర్మిలకు సింధూరం

వైఎస్.షర్మిలకు నిజామాబాద్ అభిమానులు తెలంగాణ సింధూరం అందించారు.

4.కరోనా టీకా వేయించుకున్న ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా  వేయించుకున్నారు. 

5. కరోనా టీకా వేయించుకున్న ఒడిశా సీఎం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈరోజు కోవిడ్ టీకా తీసుకున్నారు.

6.బాబును అడ్డుకోవడంపై అచ్చన్న ఫైర్

Advertisement

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం లో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం పై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

7.కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ లో కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త సునీత (35) మృతి చెందారు.

8.అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది.ఈనెల లో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సు కు అమిత్ షా హాజరు కావాల్సి ఉండగా, అకస్మాత్తుగా ఆ కార్యక్రమం వాయిదా పడడంతో అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది.

9.నటి హిమజ కు పవన్ లేఖ

"నటి హిమజ గారికి మీకు అన్ని శుభాలు జరగాలని వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను " అంటూ పవన్ లేక పంపించారు.

10.రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ  అఖిలపక్ష భేటీ ప్రారంభం .

రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష సమావేశం సోమవారం ఉదయం ప్రారంభించారు.

11.  అమరావతి నిరసనలు

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ, రైతులు, మహిళలు, రైతు సంఘాలు ప్రారంభించిన నిరసన దీక్ష నేటికి 440 వ రోజుకు చేరుకున్నాయి.

12.డబ్ల్యూ ఈ ఎఫ్ సదస్సుకు మంత్రి మేకపాటికి ఆహ్వానం

ప్రపంచ ఆర్థిక వేదిక జపాన్లోని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నేన్స్ సదస్సు 2021లో పాల్గొనాలని ఏపీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కి ఆహ్వానం అందింది.ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

13.కృష్ణపట్నం లో పోస్కో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి దక్షిణ కొరియాకు చెందిన పొస్కో స్టిల్ ఆసక్తి వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

14.భారత్ పాక్ మంచి మిత్రులు కావాలి 

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

భారత్ పాకిస్తాన్ మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడాలని రెండు దేశాల ప్రజలు విద్వేషాలను మర్చిపోయి శాంతియుతంగా జీవించాలని తాను కోరుకుంటున్నట్లు నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ అన్నారు.

15.ఆప్ లో చేరిన మిస్ ఇండియా ఢిల్లీ

మిస్ ఇండియా ఢిల్లీ 2019 మాన్సి సెహగల్ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.

16.దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్ష రద్దు

Advertisement

దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్షలను అధికారులు రద్దు చేశారు .పేపర్ లీకేజీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

17.జాన్సన్ అండ్ జాన్సన్ టీకా కు ఎఫ్ డీ ఏ అనుమతి

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకా కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

18.లాక్ డౌన్ పొడిగింపు 

తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

19.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,940 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,940.

తాజా వార్తలు