న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంత్రి పై హత్య కేసు నమోదు చేయాలి

ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త  సాయి గణేష్ ఆత్మహత్యకు బాధ్యులైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

2.సీఎంను చీపురుతో కొట్టాలి : షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ ను చీపురుతో కొట్టాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

3.భారత్ లో పేదరికం తగ్గింది : ప్రపంచ బ్యాంక్

భారత్ లో గతంతో పోలిస్తే పేదరికం బాగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది.

4.ప్రధాని పై రాహుల్ గాంధీ విమర్శలు

కొవిడ్ మరణాల సంఖ్య విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రం పై విమర్శలు చేశారు.కోవిడ్ మరణాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో తేడా ఉంది అంటూ న్యూ యార్క్ టైమ్స్ కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ కామెంట్ చేశారు.

5.చంద్రబాబు పై విజయ సాయి రెడ్డి కామెంట్స్

ఉన్నత స్థానాల్లో ఉంటున్న వారిని విమర్శించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు గుంటనక్క లను ఉపయోగిస్తున్నాడని విజయసాయి రెడ్డి విమర్శించారు.

6.కాంగ్రెస్ బిజెపి నేతలకు కళ్ళు కనిపించడం లేదు : హరీష్ రావు

ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి చోటు చేసుకుంటున్న కాంగ్రెస్ బిజెపి నేతలకు కళ్ళు కనిపించడం లేదని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

7.ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం ఉంటేనే రావాలి : కేటీఆర్

Advertisement

టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనికి ఆహ్వానం ఉంటేనే రావాలి అని కేటీఆర్ సూచించారు.

8.పువ్వాడ ఒక సైకో : జగ్గారెడ్డి

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక సైకో అని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

9.కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దు

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దయింది.

10.శ్రీవారి మెట్ల మార్గం రీఓపెనింగ్

తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని మళ్లీ తెరిచారు.మే 1 నుంచి ఈ మెట్ల మార్గంను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

11.అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు

మాజీమంత్రి టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పై పోలీసు కేసు నమోదయ్యింది. పోలీసులను దుర్భాషలాడటం పై ఈ కేసు నమోదు అయ్యింది.

12.చింతమనేని వినూత్న నిరసన

ఏపీలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ టీడీపీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆర్టిసి బస్సు లో ప్రయాణికులకు మజ్జిగ, డబ్బులు పంచి పెట్టి వినూత్న నిరసన తెలియజేశారు.

13.ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్

ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

14.అశోక్ గజపతిరాజు నిరసన

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల పై మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిరసన తెలియజేశారు.

15.గవర్నర్ కు పోస్టు కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తాడేపల్లి రైతులు పోస్ట్ కార్డులు రాశారు.

16.చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ప్రకాశం జిల్లా మార్కాపురం లో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

17.ఫేక్ సర్టిఫికెట్ లు సమర్పిస్తే క్రిమినల్ కేసులు

టిఎస్పిఎస్సి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

ఇకపై నకిలీ సర్టిఫికెట్ లతో మోసాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు.తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాలని చూస్తే అభ్యర్థులను ఐదేళ్లపాటు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

18.మరో పది లక్షల కొత్త పింఛన్లు

రాష్ట్రంలో మరో పది లక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

19.  యాదాద్రి సమాచారం

వరుస సెలవులతో యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

20.తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి : బండి సంజయ్

Advertisement

తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

తాజా వార్తలు