న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి.

ఆర్డినరీ బస్సులు కిలోమీటర్లు ఇరవై పైసలు ఇతర బస్సుల్లో 30 పైసల మేర పెరిగే అవకాశం ఉంది.

2.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  మంగళవారం తిరుమల శ్రీవారిని 23, 254 మంది భక్తులు దర్శించుకున్నారు.

3.పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం

పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం ఈ రోజు సంభవించింది.పార్లమెంటులోని 59వ గదులు ఈ ప్రమాదం జరిగింది వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు.

4.అమరావతి మహాపాదయాత్ర

అమరావతి రైతులు మహిళలు చేస్తున్న మహా పాదయాత్ర లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు వద్ద రోడ్డుపై రైతులు మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు.

5.కరెంటు చార్జీలపై షర్మిల కామెంట్స్

వరుస ధరలు పెంచి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల నడ్డి విరుస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్ చేశారు.తెలంగాణ లో ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంపు ఆలోచనపై ఆమె కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.

6.సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం చేయూత

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి తో న్యుమోనియా తో బాధపడుతూ,  సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, ఆసుపత్రి ఖర్చులు మొత్తం ఏపీ ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించుకుంది.

7.రవాణా శాఖ పై మంత్రి అజయ్ కుమార్ సమీక్ష

Advertisement

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పై ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

8.సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కు శంకుస్థాపన

తెలంగాణలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

9.తిరుమల ఘాట్ రోడ్ మూసివేత

తిరుమల రెండో ఘాట్ రోడ్ తాత్కాలికంగా మూసివేశారు.14 కిలోమీటర్ల కొండ చరియలు విరిగిపడడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

10.తిరుమల దర్శనాలు వాయిదా వేసుకోండి : టీటీడీ చైర్మన్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు  ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు ప్రయాణాలు వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కోరారు.

11.ఏపీకి మరో తుఫాన్

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.రేపు  ఏపీ , ఒడిస్సా తీరం వైపు దూసుకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

12.నేడు జగన్ తో నీతి అయోగ్ బృందం సమావేశం

ఈరోజు ఏపీలో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పర్యటించనున్నారు.  ఆయనతో పాటు నీటి ఆయోగ్ సభ్యులు కూడా ఏపీకి రానున్న సందర్భంగా ఏపీ సీఎం జగన్ తో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.

13.నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

14.కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై విచారణ

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై దాఖలైన పిటిషన్ పై  నేడు ఏపీ హైకోర్టు విచారణ జరగనుంది.

15.మహా పాదయాత్ర

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన పాదయాత్ర నేటికి 31 రోజుకు చేరుకుంది .నేడు నెల్లూరు జిల్లా మరుపురు నుంచి ఈ యాత్ర ప్రారంభం అయ్యింది.

16.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.త్వరలో అందుబాటులోకి డెంగ్యు టీబి వ్యాక్సిన్లు

Advertisement

కరుణానిధి డెంగ్యూ, టీవీ వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది .రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి సమాధానం ఇచ్చారు.

18.ఏపీ లో జూనియర్ డాక్టర్ల సమ్మె

నేటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు.Tds మినహాయింపు హామీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తూ ఈ ఆందోళనకు దిగారు.

19.  జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులను ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,600 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,650.

తాజా వార్తలు