న్యూస్ రౌండప్ టాప్ 20

1.థాయిలాండ్ లో చీకోటి ప్రవీణ్ అరెస్ట్

థాయిలాండ్ లోని పటాయా లో క్యాసినో కింగ్ గా పేరుపొందిన చీకొటి ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

2.పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్

ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.దరఖాస్తులు చివరి తేదీ మే 17.

3.వైద్యారోగ్య శాఖ పోస్టుల భర్తీ

వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.దీంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ టిఎస్పిఎస్సి ల ద్వారా 14,562 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

4.విజయశాంతి కామెంట్స్

1000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్లు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో సామాన్య ప్రజలకు ప్రవేశం ఉందా లేదా అని బిజెపి నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు.

5.ఆర్ -5 జోన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

అమరావతిలో ఆర్ 5 జోన్ పేరిట బయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రైతులు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిని మంగళవారానికి వాయిదా వేసింది.

6.జగన్ పై లోకేష్ విమర్శలు

Advertisement

రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

7.తెలంగాణ కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి

తెలంగాణ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని , దీని ప్రభావంతో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

8.తిరుమల సమాచారం

తిరుమలలో ఈరోజు భక్తులు పోటెత్తారు .స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.నిన్న తిరుమల శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకున్నారు.

9.బీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు

తెలంగాణలో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడం లేదు.కేసీఆర్( KCR ) రైతులకు కష్టాలు తప్పడం లేదు అంటూ  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శించారు.

10.భోగాపురం ఎయిర్పోర్ట్ కు జగన్ శంకుస్థాపన

ఏపీ సీఎం జగన్ మే మూడో తేదీన రెండు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.

11.భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు

భారత్లో గత కొద్ది రోజుల నుంచి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలి

ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చిన రజనీకాంత్ తనపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో, ఆయనపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఆయనకు క్షమాపణలు చెప్పాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) డిమాండ్ చేశారు.

13.పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనులపై కేసీఆర్ సమీక్ష

నేడు నూతన సచివాలయం సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనులపై తొలి సమీక్ష నిర్వహించారు.

14.జగన్ ను కలవనున్న యూఏఈ అంబాసిడర్

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

విజయవాడలో యూఏఈ అంబాసిడర్ నేడు దుర్గమ్మ దర్శనం తర్వాత ఏపీ సీఎం జగన్ ( Ap cm jagan )ను కలవనున్నారు.

15.ముగియనున్న శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు

నేటితో తిరుమల శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి.ఈరోజు గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంకు స్వామి వారు చేరుకోనున్నారు.

16.రాకెట్ ప్రయోగం

Advertisement

ఈనెల 24న శ్రీహరికోట నుంచి GSLVF -12  F రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు.

17.సిపిఎస్ కు వ్యతిరేకంగా ర్యాలీ

విశాఖలో నేడు ఏపీ సీపీఎస్సీఏ ఆధ్వర్యంలో సిపిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు.

18.కడప తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ ఏసీ బస్సు

కడపలో నేటి నుంచి కడప తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సర్వీసును డిప్యూటీ సీఎం అంజద్ భాషా( Deputy CM Anjad Bhasha ) , ఆర్టీసీ చైర్మన్ మల్కా అర్జున్ రెడ్డి ప్రారంభించనున్నారు.

19.తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి .రెండు రోజులు పాటు వాతావరణ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.

20.బట్టి విక్రమార్క పాదయాత్ర

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క( Batti vikramarka ) చేపట్టిన పాదయాత్ర భువనగిరిలో కొనసాగుతోంది.ఆలేరు నుంచి రఘునాధపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

తాజా వార్తలు