న్యూస్ రౌండప్ టాప్ 20

1.టి.బిజెపిలో ఎటువంటి మార్పులు ఉండవు : కిషన్ రెడ్డి

 

తెలంగాణ బిజెపిలో ఎటువంటి మార్పులు ఉండబోవని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 

2.ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసు

  తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసును సింగిల్ జడ్జి బెంజ్ కు అప్పగించాలన్న హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

3.జగన్ కు చంద్రబాబు వార్నింగ్

 

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.చట్ట విరుద్ధం గా తమ వాహనాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

4.ప్రతిపక్షాలపై హరీష్ రావు మండిపాటు

  ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 

5.కాంగ్రెస్తో టిఆర్ఎస్ పొత్తుపై మంత్రి స్పందన

 

కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 జోక్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

6.ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తం

  బీజేవైఎం కార్యకర్తల ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది .ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్ వైపు దూసుకు వచ్చారు. 

7.టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు

 

Advertisement

టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.టిడిపి కార్యాలయం ఎదుట జాతీయ రహదారి మీద నుంచి కార్యాలయంలోకి వెళ్లకుండా ముళ్ళ కంచే ఏర్పాటు చేశారు. 

8.నాగూర్ దర్గాలో ఏఆర్ రెహమాన్

  చెన్నైలోని నాగపట్నం జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన నాగూర్ దర్గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సందర్శించారు. 

9.చెన్నై ఢిల్లీ మధ్య అదనపు విమానాలు

 

చెన్నై ఢిల్లీ మధ్య అదనంగా రెండు సర్వీసులను ఎయిర్ ఇండియా ప్రారంభించింది. 

10.దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

  టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు . 

11.తిరుమల సమాచారం

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 61, 112 మంది భక్తులు దర్శించుకున్నారు. 

12.వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ డేట్

  మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 8న విశాఖలో నిర్వహించనున్నారు. 

13.విశాఖ డైరీ చైర్మన్ తులసీరావు మృతి

 

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు (82) హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

14.పెద్దిరెడ్డి పై చంద్రబాబు విమర్శలు

 ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

పుంగనూరు లో నీ కథ తేలుస్తా ఇది బిగినింగ్ మాత్రమే .నువ్వు ఒక సైకోలో మారావు.14 ఏళ్ళు నేను అనుకుని ఉంటే ఈ జిల్లాలో నువ్వు తిరిగి ఉండే వాడివా అంటూ బాబు మండిపడ్డారు. 

15.చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ కామెంట్స్

 

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబు నరహంతకుడని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విమర్శలు చేశారు. 

16.అస్సాంలో అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసర పరిస్థితుల్లో అస్సాంలో ల్యాండ్ అయింది.అగర్తలాకు వెళ్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో గౌహతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

17.ప్రభుత్వ ప్రధాన కార్యదర్సుల జాతీయ సదస్సు

 

నేటి నుంచి మూడు రోజులు పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. 

18.తెలంగాణలో పోలీసులకు హెల్త్ ప్రొఫైల్ క్యాంప్

  తెలంగాణలో పోలీసులకు హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ నిర్వహించనున్నారు. 

19.వివేకానంద రెడ్డి హత్య కేసు

 

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

20.తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మాణిక్ రావు థాక్రే

  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావు థాక్రే నియమితులయ్యారు.

తాజా వార్తలు