న్యూస్ రౌండ్ టాప్ 20

1.కేసిఆర్ మోసం చేశారు : లక్ష్మణ్

ఎస్సీలకు రిజర్వేషన్ పెంచకుండా కెసిఆర్ మోసం చేశారని బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

 

2.తుమ్మల నాగేశ్వరావు కామెంట్స్

  పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఓట్ల కోసమో రాజకీయం కోసం కాదని,  ప్రజల కష్టాలు తీర్చేందుకు అని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు వ్యాఖ్యానించారు. 

3.సింగరేణి పోరు దీక్ష

 

సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష ప్రారంభం అయ్యింది. 

4.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి విమర్శలు

  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , వైఎస్ జగన్ , బిజెపి తొత్తులుగా మారారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు విమర్శించారు. 

5.చంద్రబాబుపై జగ్గారెడ్డి కామెంట్స్

 

కెసిఆర్ ఏపీకి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చారని, ఇక చంద్రబాబు కెసిఆర్ తో ఆడుకుంటారని,  కూటములు , పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

6.ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం జగన్ ప్రయత్నం : సిపిఐ

  ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికల కోసమే ఆలోచిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 

7.చంద్రబాబు ఫ్లెక్సీల వివాదం

Advertisement

నెల్లూరు జిల్లాలోని కావలిలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫ్లెక్సీలు , స్వాగత ఏర్పాట్లు భారీగా చేస్తూండగా వాటిని మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకోవడంతో టిడిపి శ్రేణులు ఆయనపై వాదనకు దిగాయి.దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. 

8.నిర్మల సీతారామన్ కు అస్వస్థత

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు.దీంతో హుటాహుటిన ఆమెను ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. 

9.కొడాలి నానిని తరిమికొడతాం

 

గుడివాడలో కొడాలి నానిని తరిమికొడతామని టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. 

10.ఏపీ మంత్రిపై బీజేపీ ఎంపీ కామెంట్స్

  ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ పై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్ చేశారు.ఐటీ కోసం అమర్నాథ్ అవగాహన పెంచుకోవడానికి ఓరియంటేషన్ తీసుకుంటే మంచిదని సూచించారు. 

11.జగన్ పై కన్నా కామెంట్స్

 

జగన్ ది మోసపూరిత వ్యాపార దృక్పథం అని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు  

12.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

  టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ ను ఈడి అధికారులు విచారిస్తున్నారు. 

13.ఢిల్లీకి జగన్

 

ఏపీ సీఎం జగన్ ఈనెల 28వ తేదీన ఢిల్లీకి వెళ్ళనున్నారు. 

14.కేంద్ర బలగాల ఆధ్వర్యంలో రామప్ప దేవాలయం

  ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ను కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఈనెల 28న వెంకటాపూర్ మండలం పాలంపేట లోని రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 

15.భారత్ లో కరోనా

 

Advertisement

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

16.సోమశిల దక్షిణ కాలువకు భారీ గండి

  నెల్లూరు జిల్లాలోని సోమశిల దక్షిణ కాలువకు భారీ గండిపడింది.చేజర్ల పెద్ద చెరువు ఎగువన వంగవరపు రామకృష్ణారెడ్డి పొలాలకు సమీపంలో గండి పడింది. 

17.లాలూ యాదవ్ పై సిబిఐ విచారణ ప్రారంభం

 

రైల్వే ప్రాజెక్టుల కేసులో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై సిపిఐ విచారణ ప్రారంభించింది. 

18.బాసర ఆలయంలో పూజల ధరల పెంపు

  బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాల టిక్కెట్ల ధరలు పెరగనున్నాయి. 

19.వీడియోకాన్ గ్రూప్ సీఈఓ అరెస్ట్

 

ఐసిఐసిఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ యూత్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. 

20.కోడి పందాల పై ఆంక్షలు

  కోడిపందాలపై ఆంక్షలు విధించినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.కోడిపందాలు నిర్వాహకులు స్థలాలు ఇచ్చే వాళ్ళు కత్తులు కట్టేవాళ్ళు, గుండాట ఆడేవాళ్లను గుర్తించామని , జిల్లాలో వారం రోజుల్లో 67 మంది లిస్ట్ తయారు చేశామని, 463 మందిని బైండోవర్ చేయించామని ఎస్పీ తెలిపారు. 

21.ఈరోజు బంగారం ధరలు

  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,480   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,950.

తాజా వార్తలు