న్యూస్ రౌండప్ టాప్ 20

1.షర్మిల పాదయాత్ర .

  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటికీ 38 వ రోజుకి చేరుకుంది.

 

2.కెసిఆర్ పై ప్రవీణ్ కుమార్ విమర్శలు

  కెసిఆర్ ఏం చేసినా  ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తారని బి ఎస్ పి రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 

3.అక్టోబర్ 25 నుంచి ఇంజినీరింగ్ తరగతులు

  ఇంజనీరింగ్ ,వృత్తి విద్య, కోర్సుల తొలి సంవత్సరం తరగతులు అక్టోబర్ 25న నుంచి ప్రారంభం అవుతాయి అని ఏ ఐ సీ టీ ఈ తెలిపింది. 

3.మను లో దూర విద్య దరఖాస్తు గడువు మార్చి 31

  మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను ) లో దూరవిద్య కోర్సులు ప్రవేశానికి మార్చి 31 వరకు గడువు  విధించారు. 

4.అల్లుఅర్జున్ కారుకు జరిమానా

  సినీ నటుడు అల్లు అర్జున్ కారు కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.కారుకు బ్లాక్ ఫిల్మీ అంటించి ఉండడంతో 700 జరిమానా విధించారు. 

5.  కరీంనగర్ తీగల వంతెనకు జాతీయ అవార్డు

Advertisement

కరీంనగర్ తీగల వంతెన కు జాతీయ అవార్డు దక్కింది.అవుట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్ _- 2021 అవార్డు దక్కింది. 

6.సెప్టెంబర్ వరకు ఉచిత రేషన్

  పేదలకు అదనపు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ వరకు పొడిగించింది. 

7.టీజేఎస్ విలీనంపై కోదండరాం స్పందన

  తెలంగాణ జన సమితి పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో విలీనం చేయబోతున్నట్లు వస్తున్న వార్తల పై ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు.అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. 

8.ప్రధాని మోదీ సందేశం

  మన్ కీ బాత్ 87వ వెబ్సైట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.భారతదేశం ఆర్థిక ప్రగతి దిశగా భారీ అడుగులు వేస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 

9.భాకరాపేట ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రయత్నించిన ప్రధాని

  చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రెండు లక్షలు గాయపడిన వారికీ యాభై వేలు అందించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. 

10.ఏపీ ఆర్థిక పరిస్థితి సరిదిద్దాలి : టీడీపీ ఎంపీ

  ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ధరించాలని ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలని శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. 

11.చిన్న వెంకన్న సేవలో స్వరూపానందేంద్ర సరస్వతి

  పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం ఉదయం సందర్శించారు. 

12.బస్సు ప్రమాదం పై జగన్ స్పందన

  చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదం పై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గాయపడిన వారికీ యాభై వేలు చొప్పున పరిహారం అందించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

13.రుక్మాపూర్ లో సైనిక పాఠశాల

  కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రెండు సైనిక పాఠశాలలు మంజూరు చేసింది. 

14.పియూష్ గోయల్ పై బాల్క సుమన్ ఆగ్రహం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కళ్ళు నెత్తికి ఎక్కాయనిం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. 

15.కార్మికులకు బండి సంజయ్ విజ్ఞప్తి

Advertisement

  సింగరేణl ప్రైవేటీకరణ , ఆచరణ సాధ్యం కాదని, విషయం తెలిసినా టిఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

16.ఐసిసి మహిళా వరల్డ్ కప్

  ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు భారత్ సౌతాఫ్రికా తలపడనున్నాయి. 

17.నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

  నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

18.ఏపీ భవన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి

  నేడు ఏపీ భవన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ప్రదర్శించనున్నారు. 

19.నేటితో బేగంపేట ఎయిర్ షో ముగింపు

  నేటితో బేగంపేట ఎయిర్ షో ముగియనుంది.దీనిలో భాగంగానే నేడు సామాన్య జనాలకు వీటిని చూసేందుకు అవకాశం కల్పించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,200   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,590.

తాజా వార్తలు