‘రుద్రమదేవి’లో ఆ సీన్స్‌ హైలైట్‌?

అనుష్క ముఖ్య పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలో అనుష్క పోషించిన పాత్ర సౌత్‌లో మరే హీరోయిన్‌ కూడా చేయలేదని దర్శకుడు గుణశేఖర్‌ పలు సార్లు చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాలో అనుష్క కొన్ని సీన్స్‌లో మగరాయుడుగా కనిపించింది.

ఆ సీన్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయని, అనుష్క నటనకు అంతా మై మరచి పోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.అనుష్క యుద్ద సన్నివేశాలతో పాటు, కొన్ని సంభాషణ సన్నివేశాల్లో మగాడి వేశదారణతో కనిపించనుంది.

ఆ సన్నివేశాల్లో అనుష్క నటించిన తీరు, ఆమె హావభావాలు కూడా అందరిని ఆశ్చర్య పర్చితీరుతాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో అనుష్కలోని మొత్తం ట్యాలెంట్‌ను చూస్తారని అంటున్నారు.

Advertisement

ఈ సినిమాకు అనుష్క పడ్డ కష్టం సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుందన్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్‌, రానాలు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు