ప్రభాస్‌ తో మళ్లీ నటించే అవకాశం ఉందా అంటే అనుష్క సమాధానం..!

అనుష్క హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం సినిమా రేపు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమాకు అమెజాన్‌ వారు భారీ రేటును పెట్టినట్లు గా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం స్వీటీ అనుష్క మీడియా ముందుకు వచ్చింది.పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు తన తదుపరి సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.

ఇదే సమయంలో తనకు ఆప్త మిత్రుడు అయిన ప్రభాస్ తో సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ప్రభాస్ భారీ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఆయన నటిస్తున్న నటించబోతున్న మూడు సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి.ఆ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో కూడా తాను లేను అంటూ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

భవిష్యత్తులో ప్రభాస్ తో నటించే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించిన సమయంలో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను.తనకు ప్రభాస్ తో నటించడం ఎప్పుడు ఇష్టమే అని అనుష్క చెప్పుకొచ్చింది.

ప్రభాస్ నేను మంచి మిత్రులమని మా ఇద్దరి కాంబో ప్రేక్షకులకు నచ్చుతుంది కాబట్టి తప్పకుండా నటించాలని ఇద్దరం కూడా అనుకున్నామని అయితే కథ డిమాండ్ మేరకు మేమిద్దరం నటిస్తాం అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంలో అనుష్క ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కాకుండా కొన్నాళ్ల కైనా అనుష్క ప్రభాస్మళ్లీ కలిపి వెండితెరపై చూడబోతున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలితో పాటు అంతకు ముందు కూడా వీరిద్దరు కలిసి నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే.అందుకే వారు నటించబోయే తదుపరి సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.2024 లేదా 2025 వరకు అయినా వీరి కాంబో సినిమా వస్తుందేమో చూడాలి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు