హిందీ హీరోయిన్ల లాగే 'అనుష్క' కూడా అక్కడికి వెళ్తుంది..! అక్కడ ఏం చేస్తారో తెలుసా.? ఇంతకీ అదెక్కడ.!

అనుష్క.తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు.

ఎంతో మంది అగ్రహీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్.ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది అనుష్క.

తన అందంతో, తన నటనతో మాత్రమే కాదు తన మంచితనంతో.బయట వేడుకల్లో ప్రవర్తించే తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క.

ఆ మధ్య ప్రభాస్ తో అనుష్క పెళ్లి అనే పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ అవాస్తవం అని తేల్చేసింది స్వీటీ.

Advertisement

సినిమాలో పాత్రకు తగ్గట్టు కనిపించేందుకు అనుష్క ఎంత కష్టపడుతుందో అందరికి తెలిసిందే.సైజు జీరో కోసం ఎంతో బరువు పెరిగింది.తర్వాత బాహుబలి లో గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపించే ప్రయత్నం చేసారు.

యోగా ఎక్స్‌పర్ట్ కదా, కొన్ని ప్రయత్నాలు చేసింది… కాస్త బరువు తగ్గింది, కానీ మునుపటి ఆ కళ కూడా తగ్గిపోయింది… ఒక అరుంధతికీ, ఒక భాగమతికీ నడుమ ఎంత తేడా.? దీంతో అనుష్క కు ఆఫర్ లు తగ్గుముఖం పడ్డాయి.నిర్మాతలు కూడా కొత్త హీరోయిన్లవైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు అనుష్క సన్నగా అవ్వడంకోసం.చలో ఆస్ట్రియా… చలో వివా మైర్… పయనం కట్టింది… పాత అనుష్కను మీరు మళ్లీ చూస్తారు అంటున్నది ధీమాగా…బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు అంట.ఇంతకీ అక్కడ ఏముంది.? అక్కడ ఏం చేస్తారు ? అనే కదా మీ డౌట్.అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన డీటాక్సిఫికేషన్ సెంటర్ ఉంది అక్కడ.

దేహంలో చేరిన అనవసర, హానికారక ‘విషాల్ని’, మలినాల్ని బయటికి పంపించేసి, అదుపు తప్పిన ఒంటిని మళ్లీ మన స్వాధీనంలోకి తీసుకువచ్చే చికిత్స… అఫ్ కోర్స్, అక్కడ మనల్ని రోగులు అనరు, గెస్టులు అనే అంటారు… ఖర్చెక్కువ… కానీ తారలకు ఆ ఖర్చు ఓ లెక్కా.? అక్కడేం చేస్తారు.? నో వైఫై, నో ఫోన్, నో టీవీ, నో ఫేస్‌బుక్, నో ట్విట్టర్… చదవదలుచుకుంటే వోన్లీ పుస్తకాలు… అదో ప్రపంచం… అక్కడి డాక్టర్లకు మన ఒంటిని అప్పగించేయాలి… మన అలవాట్లు, మన దేహలక్షణాల్ని ముందుగా తెలుసుకుని, ఇక మొదలుపెడతారు… ముందుగా కడుపు, పెద్దపేగు, చిన్నపేగు మొత్తం ఖాళీ చేసేస్తారు.తర్వాత మన శరీర ఆకృతిని బట్టి ప్లాన్ చేస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

రోజుకు కేవలం 600 కేలరీల ఫుడ్డు మాత్రమే తీసుకోవాలి.సాయంత్రం నాలుగు దాటితే రా ఫుడ్ (పచ్చి ఆహారం) తీసుకోవద్దు… చివరకు సలాడ్స్ అయినా సరే.టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి దూరం పెట్టడం… అల్పాహారం మహారాజులా హెవీగా, లంచ్ ఓ మోస్తరుగా, డిన్నర్ మరీ బిచ్చగాడిలా తక్కువగా….రోజుకు మూడున్నర లీటర్ల నీళ్లు… మన దేహానికి తగినట్టు ఏం తినాలో, ఏం అవాయిడ్ చేయాలో చెబుతారు.

Advertisement

స్లిమ్ అవ్వడానికి కావాల్సిన ఎక్సర్సైజ్లు అన్ని దగ్గరుండి చేయిస్తారు.మరి త్వరలో పాత అనుష్కా ని చూస్తాము అనుకుంట.!.

తాజా వార్తలు