సాధారణంగా పెళ్లయిన హీరోయిన్ లకు సినిమాల్లో సరైన అవకాశాలు రావు అని అంటూ ఉంటారు.అయితే వాటిని అబద్దం అని నిరూపించారు ఐశ్వర్యారాయ్ బచ్చన్, రాణి ముఖర్జీ, జ్యోతిక లు.
ఈ ముద్దు గుమ్మలు పెళ్లయిన తర్వాత కూడా అదే జోష్ తో సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తూ దూసుకుపోతున్నారు.ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా సినిమాలలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం పలువురు హీరోయిన్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.వారిలో జెనీలియా కూడా ఒకరు.

తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, ఆరెంజ్, రెడీ, శశిరేఖా పరిణయం సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.జెనిలియా 2012లో రిలీజ్ అయిన నా ఇష్టం సినిమా తరువాత సినిమాలు చేయలేదు.ఇక అదే సంవత్సరం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.పెళ్లి తర్వాత హిందీలో రెండు చిత్రాలు, ఒక మరాఠీ సినిమాలో అతిధి పాత్రలో కనిపించడం తో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది జెనీలియా.
ఇక తాజాగా ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.మరాఠీ సినిమా అయినా వేద్ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.ఆ సినిమాకు తన భర్త రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మరొక హీరోయిన్ మీరా జాస్మిన్.మొదట అమ్మాయి బాగుంది సినిమా తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో గుడుంబా శంకర్, భద్ర ఇలాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆ తర్వాత 2014లో అనిల్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా నాలుగైదు సినిమాల్లో నటించింది మీరా జాస్మిన్.ఇక మీరా జాస్మిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
మక్కల్ అనే మలయాళ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది మీరాజాస్మిన్.ఇక మరొక హీరోయిన్ సీనియర్ నటి అయిన రాధ కూడా సినిమాలలో నటించే అవకాశం వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మరొక బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీ ని పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ సినిమాలో పెద్దగా నటించలేదు.కానీ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఇకపోతే చక్ ద ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో అనుష్క సినిమా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.