Animal Movie : అర్జున్ రెడ్డి ధోరణిలో యానిమల్….ఆ 3 ఎలిమెంట్స్ ఉన్నాయా ?

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి( Sandeep reddy vanga ) తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సునామి సృష్టించాడనే చెప్పాలి.

"శివ" సినిమా( తరువాత ఇండస్ట్రీని ఇంతగా ప్రభావితం చేసిన చిత్రం మరేది లేదు.

ఈ చిత్రంలో సంగీత, ఎడిటింగ్, క్యారెక్టర్లు, దర్శకత్వం.అన్ని ఇండస్ట్రీ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి.

అప్పటివరకు ఒక టెంప్లేట్ ను ఫాలో అవుతున్నవారంతా తమ ధోరణిని మార్చుకోవలసి వచ్చింది.అదే చిత్రాన్ని హిందీ లో కబీర్ సింగ్ గా మళ్ళీ తెరకెక్కించి, ఇదే మానియా ను దేశమంతా వ్యాపింపజేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు, ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది.ఇప్పుడు సందీప్ రెడ్డి తన మూడో చిత్రం "యానిమల్"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరు ఈ చిత్రంలో కూడా దర్శకుడు అర్జున్ రెడ్డి ఫార్ములానే వాడాడు అంటున్నారు.

అసలు ఆ ఫార్ములా ఏంటి? అంత కొత్తగా సందీప్ ఏం చేసాడు ? ఇప్పుడు చూద్దాం.

అర్జున్ రెడ్డి చిత్రంలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం హీరో క్యారక్టర్.ఆ చిత్రం ఒక "క్యారక్టర్ డ్రివెన్ ఫిలిం".అంటే.చిత్రం హీరోతో పాటు వెళ్తుంది.

అతని ఒడిదుడుకులు, కష్ట నష్టాల వెనుక సాగుతూ ఉంటుంది.అతని జీవితంలో ఒక్కో సంఘటన అతన్ని ఏ విధంగా మార్చాయి అనేదే కథ.ఇది ప్రేక్షకులను బాగా ఎఫెక్ట్ చేసింది.హీరో క్యారక్టర్ కి కనెక్ట్ చేసింది.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇప్పుడు ఇదే విధంగా యానిమల్ సినిమా( Animal Movie )లో హీరో క్యారక్టర్ కూడా డిజైన్ చేసారు సందీప్.ఇక రెండోది "లవ్".ఒక అగ్రెస్సివ్ క్యారక్టర్ ని ప్రేమ ఎలా మార్చింది? తన కెరీర్ ని సైతం పక్కన పెట్టి, ఆ ప్రేమకు దాసోహం ఐపోయిన ఒక ప్రేమికుడి ఆవేదనను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

Advertisement

ఈ ఎలిమెంట్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.ఇప్పుడు యానిమల్ లో కూడా తండ్రి కొడుకుల మధ్య ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు.ఇక మూడో విషయం సినిమా "స్ట్రక్చర్".

ఒక సినిమా అంటే ఇలానే ఉండాలి, ఇన్ని పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి, హీరోని మంచివాడిలాగానే చూపించాలి అన్న అపోహలను తుడిచిపెట్టి హీరోకి ఒక అగ్రెస్సివ్, సెల్ఫ్ డిష్ట్రక్టీవ్ నేచర్ ఉన్న క్యారెక్టర్ ని డిజైన్ చేసారు సందీప్.ఇది ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

ఇప్పుడు యానిమల్ చిత్రంలో కూడా హీరో ఒక రూత్ లెస్ గ్యాంగ్ స్టర్.తన తండ్రి జోలికి ఎవరైనా వస్తే మంచి, చెడు ఆలోచించని ఒక కిరాతకుడు.

మరి ఈ క్యారక్టర్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.సందీప్ అర్జున్ రెడ్డి ( Arjun Reddy )లో వాడిన ఈ మూడు ఎలిమెంట్స్ యానిమల్ లో కూడా వర్క్ అవుట్ ఐతే, ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయం.

తాజా వార్తలు