Animal movie review : యానిమల్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్గా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నటువంటి సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

అయితే ప్రస్తుతం ఈయన యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రణబీర్ కపూర్ ( Ranabir Kapoor ) రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో తిరిగిన ఈ సినిమా నేడు డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

ఇందులోఅనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు నటించారు మరి డిసెంబర్ ఒకటవ తేదీ విడుదలైన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ:

అత్యంత సంపన్నులలో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు.స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని.రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్)( Ranabir Kapoor ) ఆయన కుమారుడు.

Advertisement

విజయ్ కాస్త అగ్రెసివ్.అక్కను ర్యాగింగ్ చేశారని కాలేజీకి గన్ తీసుకెళ్లి విద్యార్థులను భయపెడతాడు.

ఇలా విజయ్ సింగ్ ప్రవర్తన తన తండ్రికి నచ్చకపోవడంతో తన కుమారుడిని బోర్డింగ్ స్కూల్కు పంపిస్తాడు.తిరిగి వచ్చిన తర్వాత బావతో జరిగిన గొడవ కారణంగా తండ్రి కొడుకుల మధ్య దూరం మరింత పెడుతుంది.

రణ్ విజయ్ సింగ్ అమెరికా వెళతాడు.తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలుసుకొని విజయ్ సింగర్ 8 సంవత్సరాల తర్వాత ఇండియాకి వస్తారు.

అయితే తన తండ్రికి ప్రమాదం తలపెట్టిన వారి తలలు తెగ నరుకుతానంటూ ఈయన శపథం చేశారు.ఆ సమయంలోనే తనకు గీతాంజలి (రష్మిక)( Rashmika ) పరిచయమవుతుంది వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? తన తండ్రిపై అటాక్ చేసినది ఎవరు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

నటీనటుల నటన:

రణబీర్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన అద్భుతమైన నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాలో ఈయన అన్ని వయసు పాత్రలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి తన పాత్రకు వందశాతం న్యాయం చేశారని చెప్పాలి ఇక గీతాంజలి పాత్రలో రష్మిక కూడా ఆధార కొట్టింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే సన్నివేశాలలో కూడా బాగా నటించారు.

Advertisement

అలాగే బాబి డియోల్ అనిల్ కపూర్ వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తి శాతం న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమాని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఈ సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలు కూడా అద్భుతంగా చూపించారు అయితే కొన్ని సన్నివేశాలు చాలా లెంతీగా అనిపించాయి.ఎడిటింగ్ వర్క్ కాస్త మెరుగ్గా ఉంటే సరిపోయేది సినిమా నిడివి ఎక్కువగా ఉందనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది.

నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి అనిపించింది.

విశ్లేషణ:

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో అక్కని కాలేజీలో ర్యాగింగ్ చేస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్లిన తమ్ముళ్లను చూసాము కానీ ఇలా గన్ తో వెళ్లి బెదిరించే సీన్లను మనం చూడలేదు ఇది సందీప్ రెడ్డి స్టైల్ అనే చెప్పాలి.యాక్షన్స్ సన్ని వేషాలు తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను అద్భుతంగా చూపించారు.

ఇక సెకండ్ హాఫ్ తర్వాత సినిమా మరో లెవల్ కి వెళ్లిందని చెప్పాలి మొత్తానికి సరికొత్త కాన్సెప్ట్ ద్వారా సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్లస్ పాయింట్స్:

హీరో హీరోయిన్ల నటన, క్లైమాక్స్ సన్నివేశం, కొన్ని ఎమోషన్స్ సీన్స్.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ తర్వాత సీన్లు కాస్త లెంతీగా అనిపించాయి, మ్యూజిక్, సినిమా నిడివి ఎక్కువ ఉండటం.

బాటమ్ లైన్:

యానిమల్.రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు.క్యారెక్టర్ బేస్డ్, కంటెంట్ బేస్డ్ చిత్రమిది.

సరికొత్త కాన్సెప్ట్ ద్వారా సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చారని చెప్పాలి.

రేటింగ్ 2.75/5

తాజా వార్తలు