ఆ విషయంలో బాలయ్య తోపు అంటున్న అనిల్ రావిపూడి...

సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరో లు ఉన్నప్పటికీ బాలయ్య కి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.

బాలయ్య( Balakrishna ) ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా భగవంత్ కేసరి.

ఈ సినిమా తెలుగులో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ దశలో ఉంది .ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ పిక్స్ అభిమానులను తెగ ఆకట్టుకునేసాయి.సినిమా కూల్ అండ్ క్లాస్ హిట్ అవుతుందని చెప్పేస్తున్నారు .అయితే ఏ డైరెక్టర్ చేయలేని పని అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్య తో చేయించి నందమూరి అభిమానులకు మరింత స్పెషల్ అయిపోయాడు .మనకు తెలిసిందే బాలయ్య డాన్స్ పరంగా కూసింత వెనకంజ లో ఉన్నారు .అయితే అనిల్ రావిపూడి అభిమానులకు ఆ లోటును తీర్చేశాడు అంటూ తెలుస్తుంది.

ఈ సినిమాలో బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేశారట .అది కూడా డూప్ లేకుండా.ఎవరి హెల్ప్ లేకుండా .ఆ స్టెప్ కోసం ఏకంగా 10 రోజులు బాలయ్య ప్రాక్టీస్ చేశాడట.ఇక ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి( Anil ravipudi ) కామెడీ చేయించడం లో ఎక్స్ పర్ట్ కాబట్టి బాలయ్య చేత ఈ సినిమా లో కామెడీ కూడా చేయించాడు అని తెలుస్తుంది.

Advertisement

బాలయ్య డాన్స్ కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయని తెలుస్తుంది.ఇక ఈ రెండు విషయాల మీద సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా అవుతుంది.

కామెడీ నీ పక్కన పెడితే డాన్స్ విషయం లో మాత్రం ఎన్టీఆర్ – బన్నీ – చరణ్ లాంటి యంగ్ హీరోల ఫ్లోర్ స్టెప్స్ వేస్తున్న క్రమంలో బాలయ్య ఇలాంటి సీనియర్ హీరో కూడా అదే రేంజ్ లో స్టెప్ లు వేయడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది .అందుకే ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు .దీంతో సోషల్ మీడియాలో భగవంత్ కేసరి హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది.ఇక బాలయ్య లో అన్ని కోణాలు ఈ సినిమాలో కనిపిస్తాయి అని అనిల్ రావిపూడి చెప్తున్నాడు ఇక బాలయ్య ఈ సినిమాతో హైట్రీక్ హిట్ కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు