అందుకు నేను చాలా గర్వపడుతున్నాను... అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం పలు సిని థియేటర్లను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా విజయవాడలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ముందుగా విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం ఈయన పలు థియేటర్లకు వెళ్లారు అనంతరం మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇప్పటివరకు నేను ఆరు సినిమాలు చేశాను.ఇది నాకు ఏడవ సినిమా అయితే నా ఆరు సినిమాలు కూడా ఒకే జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక ఈ ఏడవ సినిమా అన్నింటికంటే కాస్త భిన్నంగా ఉందని తెలిపారు ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు, శ్రీ లీల ( Sreeleela ) మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని అనిల్ రావిపూడి తెలిపారు.

Advertisement

ఈ సినిమా ద్వారా బనావో భేటీకో షేర్‌ అనే సందేశాన్ని చూపించడం అద్భుతంగా అనిపించిందని తెలిపారు.

ఇక ఇప్పటివరకు నేను చేసినటువంటి సినిమాలలో ఈ సినిమా తనకు ఎంతో పేరు తీసుకురావడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎంతో మంచి కలెక్షన్స్ తీసుకు వచ్చిందని డైరెక్టర్ అనిల్ వెల్లడించారు.వేధింపుల పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఇందులో చూపించిన గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ సీన్‌ని అందరూ ఆదరిస్తున్నారు.ముఖ్యంగా పోలీస్‌ అధికారులు, స్కూల్స్‌కు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపుల్లో( Whatsapp Groups ) ఇది షేర్‌ అవుతోంది.

అందుకు నేను గర్వపడుతున్నాను అంటూ అనిల్ రావిపూడి తన సినిమా విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు