వెంకటేశ్ అనిల్ మూవీ టైటిల్ మారిందా.. కొత్తగా రిజిష్టర్ చేసిన టైటిల్స్ ఇవేనా?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.

అలాగే ఇప్పటి వరకు ఒకే తరహా కథలు కాకుండా ఎప్పటి కప్పుడు కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు అనిల్ రావిపూడీ.అదేవిధంగా ఆయన సినిమా టైటిల్స్ కూడా అలాగే కాస్త డిఫరెంట్ గా ఉండటం మనం గమనించే ఉంటాము.

అయితే ఇప్పుడు ఈ టైటిల్స్ విషయంలో అనిల్ రావిపూడి ఈవీవీ సత్యనారాయణను( EVV Satya Narayana ) ఫాలో అవుతున్నారట.

ఇప్పుడు ఈవీవీ స్టైల్ లో ఓ టైటిల్ సెట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.కాగా వెంక‌టేష్( Venkatesh ) హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు నిర్మాత‌గా వ్యవహారిస్తున్నారు.

Advertisement

వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు మూవీ మేకర్స్.అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 90 శాతం షూటింగ్ కూడా పూర్త‌య్యింది.

మ‌రోవైపు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లెట్టారు.ఈ సినిమా కోసం సంక్రాంతికి వ‌స్తున్నాము( Sankrantiki Vastunnamu ) అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారట.

వాటితో పాటు మరో రెండు కొత్త టైటిళ్లు కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలుస్తోంది.

ఇంట్లో ఇల్లాలు- పోలీస్ స్టేష‌న్ లో ప్రియురాలు, ఇక్క‌డ ఇల్లాలు.అక్క‌డ ప్రియురాల అనే టైటిళ్లు కూడా చాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించారట.ఇవి అనిల్ రావిపూడి, వెంకీ సినిమా కోస‌మే అని టాక్‌.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?
స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ సూపర్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి!

ఈ క‌థ కూడా ఇల్లాలు, ప్రియురాళ్ల‌కు సంబంధించిన‌దే.కాబ‌ట్టి ఈ టైటిల్స్ యాప్ట్ అనుకొంటున్నారట.

Advertisement

ఫ్యామిలీ డ్రామాల‌కు ఇలాంటి టైటిళ్లు బాగా సెట్ట‌వుతాయని, ఇందులో క్రైమ్ ఎలిమెంట్‌, స‌స్పెన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.దీపావ‌ళికి టైటిల్ ప్ర‌క‌టించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

అయితే మూడు టైటిళ్ల‌లో ఏది ఫిక్స్ చేయాలి? అనే విష‌యంలో ఇంకా ఒక స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని తెలుస్తోంది.దిల్ రాజు ఆమోద ముద్ర ప‌డ‌గానే, టైటిల్ ప్ర‌క‌టించేస్తారని టాక్.

తాజా వార్తలు