రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజా ప్రభుత్వంలో ప్రజలు కోరుకునేదే చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని సనుగుల గ్రామంలో, మూడపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం అన్నారు.
20 సంవత్సరాల క్రితం దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు,ఫ్యాక్స్, డీసీఎంఎస్ లకు అప్పజెప్పడం జరిగిందని,రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
సన్నరకం వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులకు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేసారని తెలిపారు.
సాంకేతిక సమస్య వల్ల మాఫీ కానీ రైతుల ఖాతాల్లో జమ చేయడానికి వ్యవసాయ శాఖ,బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఆనాడు పాదయాత్ర చేసి శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చి 1737 కోట్లు మంజూరు చేసారని తెలిపారు.మొన్నటి బడ్జెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో 325 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రాజకీయంగా జన్మనిచ్చిన చందుర్తి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.
ఏమన్నా మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గా అవకాశం ఇచ్చారని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన ఒకే ఒక యారన్ డిపోను చేనేత క్లస్టర్ గా పేరొందిన వేములవాడకు తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఇటీవల మూడపల్లి గ్రామంలో ప్రజల సౌకర్యం నిర్మాణానికి 82 లక్షల నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు.
గల్ఫ్ కార్మికులను గత ప్రభుత్వ మోసం చేసిందని తెలిపారు.ప్రజా ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులకు జీవో తెచ్చి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల వేములవాడ నియోజకవర్గం లోని మొట్టమొదటిది ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రజా ప్రభుత్వంలో వచ్చే రాబడి గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీ కట్టడానికి పోతుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు కోరుకునేదే చేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్య విద్యార్థి లాగా ప్రజలు అధికారులు చెప్పేది వింటూ నూతన పాలసీలను తయారు చేస్తున్నారని తెలిపారు.