మంత్రులకు మార్కులు పాస్ కాకపోతే ఇంటికేనా ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తన నాలుగు నెలల పరిపాలనా కాలాన్ని సమీక్షించుకుంటున్నాడు.తన పరిపాలనా కాలంలో ప్రజలు ఏ విషయాల్లో సంతృప్తిగా ఉన్నారు, ఇంకా ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

  ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల సమతూకం పాటించి అందరి మెప్పు పొందిన జగన్ ఆ మంత్రుల పనితీరును కూడా ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో తెప్పించుకుంటున్నారు.ఇప్పటికే పనితీరు సరిగ్గా లేని మంత్రులు కొంత మందికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.ఇక ఇదే రిపోర్ట్ మరోసారి వస్తే మీ మంత్రి పదవి ఇవ్వడం ఖాయం అంటూ హెచ్చరికలు కూడా చేసినట్లు తెలుస్తోంది.

  ప్రస్తుతం నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సుమారు ఆరుగురు ఏడుగురు మంత్రులు అలంకారప్రాయంగా ఉన్నారే తప్ప, అటు ప్రజలకు ఇటు పార్టీకి పెద్దగా చేసింది ఏమీ లేదని జగన్ కు రిపోర్ట్ అందిందట.వీరిలో మైనారిటీ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎస్సీ వర్గానికి చెందిన గిరిజన మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సంక్షేమ శాఖ మంత్రి ఎక్సైజ్ మంత్రి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, కార్మిక శాఖ మంత్రి ఇ గుమ్మనూరు జయరాం, బీసీ మంత్రి శంకర్ నారాయణ పై నివేదికలు జగన్ కు అందిందట.వీరంతా జగన్ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని నివేదికలలో తేలిందట.

  వీరి స్థానంలో లో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించే ముగ్గురు నలుగురు కీలకమైన ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇస్తే బాగుంటుందని ఆలోచన కూడా జగన్ చేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఉన్న మంత్రులను రెండున్నర సంవత్సరాలు వరకు మార్చేది లేదని జగన్ గతంలోనే ప్రకటించినా పనితీరు, అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదని గతంలోనే అనేక సార్లు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొంతమందికి ఉద్వాసన తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.ప్రస్తుతం వైసీపీ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

తాజా వార్తలు