కేసీఆర్ యాగం నిధుల గుట్టు ర‌ట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ స‌రికొత్త ఆరోప‌ణ వ‌చ్చింది.కేసీఆర్ గ‌తేడాది ఆయుత చండీయాగం అట్ట‌హాసంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

జాత‌కాలు, సెంటిమెంట్లు, ముహూర్తాలు బాగా ఫాలో అయ్యే కేసీఆర్ ఈ ఆయుత చండీయాగాన్ని క‌ళ్లుచెదిరే రీతిలో నిర్వ‌హించ‌డంతో పాటు ఈ యాగానికి దేశంలో చాలా మంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు.తెలంగాణ ప‌క్క తెలుగు రాష్ట్ర‌మైన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అప్పుడు కేసీఆర్‌తో తీవ్రంగా విబేధిస్తున్నా.

ఆయ‌న‌తో పాటు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సైతం ఈ యాగానికి వ‌చ్చారు.ఇక కేసీఆర్ సీఎం అయ్యాక ప్ర‌ముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఆస్తుల‌ను కూడా కేసీఆర్ టార్గెట్ చేశారు.

నాగార్జున‌తో పాటు ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త‌ల ప‌ని కూడా ప‌డ‌తాన‌ని కేసీఆర్ ఎన్నో శ‌ప‌థాలు చేశారు.అదంతా గ‌తం ఇప్పుడు కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుమారుడు కేటీఆర్ చాలా మంది ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త‌ల‌తోను సినీరంగంలో ఉన్న ఆంధ్రాప్రాంతానికి చెందిన టాప్ హీరోల‌తో ఎంతో క్లోజ్‌నెస్ మెయింటైన్ చేస్తున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, జ‌గిత్యాల ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.తెలంగాణ ఉద్య‌మానికి వెన్నుముక‌గా నిలిచిన కోదండ‌రాంను సిగ్గులేదా అని విమ‌ర్శించడానికి మంత్రి కేటీఆర్ స్థాయి ఎంత అని జీవ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.

ఇక కేసీఆర్ గ‌తేడాది ఎంతో అట్ట‌హాసంగా చేసిన ఆయుత‌ చండీయాగంకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులే నిధులు ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు.తెలంగాణ ద్రోహులుగా ముద్ర‌ప‌డ్డ వారిని కేసీఆర్ త‌న కేబినెట్‌లో చేర్చుకోలేదా అని ప్ర‌శ్నించిన జీవ‌న్‌రెడ్డి.? సినిమా హీరో అక్కినేని నాగార్జున - ఆంధ్రా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో దోస్తీ చేస్తోన్న కేటీఆర్‌కు సిగ్గుందా అని ధ్వ‌జ‌మెత్తారు.జీవ‌న్‌రెడ్డి కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఆయుత చండీయాగం నిధులు గుట్టును ఇలా బ‌య‌ట పెట్ట‌డం కేసీఆర్ స‌ర్కార్‌కు ఇబ్బందే.! మ‌రి దీనిపై టీఆర్ఎస్ నాయ‌కుల కౌంట‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు