బాలయ్య, చిరంజీవిపై ప్రశ్నలు.. గీతా మాధురిని ఇరుకున పెట్టిన యాంకర్ సుమ!

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో గురించి ప్రేక్షకులకు కూడా అంతా తెలుస్తుందో లేదో తెలియదో కానీ యాంకర్ సుమ గురించి మాత్రం తెలినోలే లేరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా నిలిచి మంచి పేరు సంపాందించుకుంది.

స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమకు ఉందనే చెప్పాలి.పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా నిలిచింది.బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ సీనియర్ స్టార్ యాంకర్ గా నిలిచింది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ సుమ కు యాంకర్ గానే మంచి క్రేజ్ వచ్చింది.

Advertisement

ఒక ఎంటర్టైన్మెంట్ షో లలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.

ఇక సుమ మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.

పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్.

స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన గల గల మాటలతో వారిని కూడా ఫిదా చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుంది.ఇంతవరకు సుమకు ఎటువంటి విమర్శలు కూడా రాలేవు.ఎందుకంటే ఆమె ఉండే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

ఆమె మాట్లాడే విధానం అందర్నీ ఆకర్షిస్తుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే శక్తి ఉందని సులువుగా చెప్పవచ్చు.

ఇక సుమ అందరి కుటుంబ, వ్యక్తిగత విషయాల గురించి బాగా అడిగి తెలుసుకుంటుంది కానీ తన గురించి మాత్రం ఎక్కువగా బయట పెట్టదు.ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సుమ వెంటనే తన ఫ్యామిలీ టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది.

సుమ షో కు వచ్చిన చాలామంది రాజీవ్ కనకాల గురించి ఏదో ఒక టాపిక్ తీస్తుంటారు.కానీ ఆ విషయాన్ని అక్కడికే స్టాప్ చేస్తుంది.

ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా తన క్యాష్ షో ప్రోగ్రామ్ కి వచ్చిన గీతామాధురి ని కూడా ఇరకాటంలో పెట్టింది.

గీతా మాధురి కి చిరంజీవి, బాలయ్య కు సంబంధించిన ప్రశ్నలు వేసి అందులో ఎవరో ఒకరి గురించి సమాధానం రప్పించగా.అంటే మరో హీరోను అలా అంటావా అన్నట్లుగా బాగా ఇరకాటంలో పెట్టింది.

ఇక దీని గురించి చెప్పడం కంటే ఈ వీడియో చూడటం వల్ల ఆ ఇరకాటం ఏమిటో అర్థమవుతుంది.

తాజా వార్తలు