Raj Anchor Shiva : ఇంటర్వ్యూలో రాజ్ ని దారుణంగా అవమానించిన యాంకర్ శివ.. వైరల్ వీడియో?

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివ గురించి మనందరికీ తెలిసిందే.

యాంకర్ శివ ప్రస్తుతం ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరొకవైపు బిగ్ బాస్ కేఫ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మొదట్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఒక ఆట ఆడుకున్న యాంకర్ శివ రాను రాను ఆటపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు.అయితే కంటెస్టెంట్స్ పట్ల యాంకర్ శివ ప్రవర్తిస్తున్న తీరును చూసి నెటిజన్స్ బిగ్ బాస్ ప్రేమికులు మండిపడుతున్నారు.

బిగ్ బాస్ కేఫ్ కి వచ్చిన కంటెస్టెంట్ లను అవమానించే విధంగా మాట్లాడుతూ వారిని ఇన్సల్ట్ చేస్తూ వెకిలిచేష్టలు చేస్తూ నవ్వుతున్నాడు.తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రాజ్ పట్ల కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తూ రాజ్ ను ఘోరంగా అవమానించాడు.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే ఆడాలి మాట్లాడాలి ఈ రెండు జరగకుండా నువ్వు 12 వారాల దాకా వచ్చావు.అంటే నిజంగానే నువ్వు నక్క తోక తొక్కి వచ్చావు రాజ్ అంటూ అతన్ని అవమానించే విధంగా మాట్లాడాడు.

Advertisement

బిబి కెఫెకు వచ్చిన ఓ వ్యక్తి నువ్వు కెమెరాల నుంచి తప్పించుకుని భలే ఆడావన్నాడంటూ పడీపడీ నవ్వాడు.

అప్పుడు రాజ్ ముఖమంతా కూడా సీరియస్ గా పెట్టి ఏం మాట్లాడాలో తెలియక అదే నా గేమ్‌ అని ఒప్పుకుంటున్నాను అనగానే శివ మళ్ళీ పగలబడి నవ్వాడు.ఏమీ ఆడకుండా 12 వారాలు ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లున్నావంటూ వెటకారంగా మాట్లాడాడు.శివ మాటలకు ఓపిక నశించి పోయిన రాజ్‌.

ఏం మాట్లాడుతున్నావ్‌ బ్రో, నీకేమైనా నరాలు కట్‌ అయ్యాయా? అని ప్రశ్నించాడు.అయినా తగ్గని శివ కేవలం లక్‌ వల్లే ఇన్నివారాలు ఉండగలిగావన్నట్లుగా తనను పదేపదే అవమానిస్తున్నాడు.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఆ ప్రోమోని చూసిన నెటిజన్స్ యాంకర్ శివ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

అతనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విడుచుకుపడుతూ మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు