యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..ఎందుకంటే..?

యాంకర్ శ్యామల మరోసారి వార్తల్లోకి ఎక్కారు.ఈ సారి ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన వివరాల గురించి కాదు.

ఆమె భర్త మీద నమోదయిన చీటింగ్ కేసు విషయంలో.ఈ మధ్య కాలంలో సుమతో పోటీ పడుతూ శ్యామల అనేక ఈవెంట్స్, టీవీ షోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల వలన ఆమె గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.అయితే ఆమె భర్త మీద చీటింగ్ కేసు నమోదైనట్లు మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి.

యాంకర్ శ్యామల భర్త నర్సింహా రెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.నర్సింహా రెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు చేసింది.2017 నుండి తన దగ్గర విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహా రెడ్డి బెదిరించాడని తెలిపింది.2017 నుంచి ఇప్పటివరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.డబ్బుల విషయం గురించి అడిగితే బెదిరింపులకు దిగారని ఆ మహిళ ఫిర్యాదులో తెలిపింది.

Advertisement

డబ్బు తీసుకోవడమే కాకుండా లైంగికంగా కూడా నరసింహా రెడ్డి వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు.అయితే ఈ కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలని నరసింహా రెడ్డి తరపున ఒక మహిళ కూడా రాయబారం చేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.నర్సింహా రెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలుస్తోంది.అయితే ఈ అంశం మీద శ్యామల స్పందించాల్సి ఉంది.

ఇక కాకినాడకు చెందిన యాంకర్ శ్యామల టీవీ నటుడు నరసింహారెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లి అనుకున్నంత సాఫీగా అయితే జరగలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కులాలు వేరు కావడంతో తాను 17 ఏళ్లకే ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.అయితే తాను మేజర్ కాకముందే ప్రేమలో పడడంతో పెళ్లి చేసుకోవడానికి బయటకు వచ్చాక కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

తాను జగదేకవీరుడు అతిలోక సుందరి అనే సీరియల్ చేస్తున్న సమయంలో తమ ఇద్దరికీ పరిచయం అయిందని, ఆ పరిచయమే ప్రేమగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు