కాబోయే భార్య ఫోటోతో రచ్చ చేసిన ప్రదీప్.. ఆమె ఎవరంటే?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ ను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రదీప్ పెళ్లికి సంబంధించి గతంలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ప్రదీప్ మాత్రం పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.ప్రదీప్, శ్రీముఖి జోడీగా ఒక ప్రముఖ ఛానల్ లో పెళ్లి పేరుతో ఒక ఈవెంట్ ను కూడా చేశారు.

అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రదీప్ కాబోయే భార్య ఫోటో రచ్చరచ్చ చేశారు.సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ పేరుతో ప్రదీప్ జీతెలుగు ఛానల్ లో ఒక షోను హోస్ట్ చేస్తున్నారు.

ఈ షోలో ఫోటో పట్టుకుని మురారి సినిమాలోని పాటతో ప్రదీప్ ఎంట్రీ ఇచ్చారు.మీ ప్రశ్నలకు సమాధానం ఈరోజు దొరుకుతుందని ప్రదీప్ చెప్పుకొచ్చారు.

Advertisement

సూర్యకాంతం, త్రినయని సీరియళ్ల నటులు ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రదీప్ తన పంచ్ లతో ఈ షోలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

అయితే ప్రదీప్ మాత్రం ఆ ఫోటో గురించి ప్రోమోలో ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు.ఈ షో ఈరోజు రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కానుంది.

ఒకవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే వెండితెరపై కూడా సక్సెస్ కావడానికి ప్రదీప్ మాచిరాజు ప్రయత్నం చేస్తున్నారు.ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు బిజినెస్ మాత్రం రికార్డు స్థాయిలో జరిగింది.పెళ్లి గురించి షోలలో చెబుతున్న ప్రదీప్ త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.ప్రదీప్ మాచిరాజు పెళ్లి వార్త గురించి ప్రదీప్ అభిమానులు సైతం ఎంతగానో ఎదురుచూస్తుండటం గమనార్హం.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు