ప్రేమించినా, ద్వేషించినా నాకు పోయేదేమీ ఉండదంటున్న తెలుగు యాంకర్...

టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందమైన యాంకర్ అనసూయ.

ఈమె సినిమాలు చానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా తెలుగులో ఉన్నటువంటి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో యాంకరింగ్ పరంగా తన హవా ని కొనసాగిస్తోంది.

అంతేకాక ఈ అమ్మడు ఒకపక్క షోలు, ఈవెంట్లు చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ, పలు ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది.దీంతో ప్రస్తుతం యాంకర్ అనసూయ రెండు చేతులా సంపాదిస్తోంది.

అయితే తాజాగా యాంకర్ అనసూయ ఓ ప్రముఖ ఫోటోషూట్ ఈ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా కొత్త తరం ప్యాషన్ తో చీరకట్టులో అందమైన ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే తాజాగా అనసూయ ప్రేమకు సంబంధించిన ఓ కవితని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

Advertisement

అయితే ఇంతకీ ఆ కవిత ఏంటంటే "నన్ను ప్రేమించిన, ద్వేషించినా, లేదా నాకు ధర కట్టినా పోయేది ఏమీ ఉండదని దాని అర్థం.ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు అని అంటోంది".

అయితే ప్రస్తుతం ఈ ప్రేమ కొటేషన్ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.అంతేగాక నెటిజన్లు ఇంత ప్రేమగా ఎవరి కోసం కొటేషన్స్ షేర్ చేసావంటూ యాంకర్ అనసూయపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య అనే  చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.అలాగే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అటువంటి చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు