ప్రపంచం మహమ్మారి వైరస్‌ బారిన పడుతుంది: ముందే కరోనాను ఊహించిన బిల్‌గేట్స్

పుట్టిన దేశం కంటే మిన్నగా బయటి దేశాలను వణికిస్తోంది కరోనా.

అన్ని రంగాలను ప్రభావితం చేసి జనాన్ని గడప దాటి బయటకు రానీయకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసి ఏకంగా మానవాళి మనుగడనే ప్రమాదంలోకి నెట్టింది.

భారతదేశంలోనూ దీని తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది.ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు.

అదేదో హాలీవుడ్ సినిమా చూసినట్లుగా పరిస్థితి ఉందే అని పిన్నలు, పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే ఈ స్థితిని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, కుబేరుడు బిల్‌గేట్స్ మందే ఊహించారు.

ఓ వైరస్ మానవాళిపై దాడి చేస్తుందని, ఫలితంగా ఎంతోమంది మృత్యువాత పడతారని, అన్ని దేశాలు ఆర్ధికంగా దెబ్బతింటాయని బిల్‌గేట్స్ అప్పట్లో తెలియజేశారు.భవిష్యత్తులో దాడి చేసేవి మిస్సైల్స్ కావని, మైక్రోబ్స్ అన్న గేట్స్.

Advertisement

అణు యుద్ధం విషయంలో ఎలాగైతే ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయో, అలాంటి జాగ్రత్తలే వైరస్ విషయంలో తీసుకోవాలని సూచించారు.ఎబోలా వైరస్ లాంటివి ఇప్పటికే మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నా దేశ ప్రభుత్వాలు కళ్లు తెరవడం లేదని బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎబోలా నగరాలు, పట్టణాలు విస్తరించకపోవడం గ్రామాలకే పరిమితమవ్వడం మన అదృష్టమని.అయితే అన్ని వేళలా అదృష్టం మనల్ని కాపాడదని ఆయన వ్యాఖ్యానించారు.

అణ్వస్త్రాలను ప్రయాణ మార్గంలోనే ధ్వంసం చేసే క్షిపణి నిరోధక వ్యవస్థపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయని.కానీ వైరస్‌లను నియంత్రించే వ్యవస్థలను పట్టించుకోవడం లేదని బిల్‌గేట్స్ అన్నారు.

ఆయన చెప్పినట్లుగానే సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వైరస్‌ల బారినపడి వేలాది మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఎబోలా వైరస్ ధాటికి 2013 నుంచి 2016 మధ్యకాలంలో ఆఫ్రికా దేశాల్లో 11 వేల మంది మరణించారు.కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భూగోళం మీద 11 వేలమంది మరణించగా, రెండు లక్షల మందికి వైరస్ సోకి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.మరోవైపు కొద్దిరోజుల క్రితం మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి ఆయన వైదొలిగిన సంగతి తెలిసిందే.2000లో సీఈవో పదవికి రాజీనామా చేసిన బిల్‌గేట్స్, 2014లో ఛైర్మన్ పదవి నుంచి సైతం తప్పుకున్నారు.

Advertisement

తన భార్యతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నాకా వర్థమాన దేశాల్లో వైరస్‌ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కలిగిస్తున్నారు.దీనితో పాటు పర్యావరణ మార్పులు, పేదరికం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలకు బిల్‌గేట్స్ వేలాది కోట్లు విరాళం ఇచ్చారు.

తాజా వార్తలు