మెగా హీరోలను మించిపోతున్న పవన్ కొడుకు...

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు.

అయితే స్వశక్తితో  ఎటువంటి సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి ఒక స్టార్ గా ఎదిగి తన ప్రస్థానాన్ని కొనసాగించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో మంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే ఇప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు టాలీవుడ్ కి పరిచయమయ్యారు.అయితే ఇందులో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, నిహారిక ఇప్పటికే టాలీవుడ్ లో బాగానే రాణిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించి అయితే చెప్పనవసరం లేదు.అయితే ఇక మిగిలింది టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్.

అయితే అకీరా నందన్ టాలీవుడ్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తో విడిపోవడంతో ప్రస్తుతం అకీరా నందన్ తన తల్లితో ఉంటున్నాడు.

Advertisement

అయితే తాజాగా అకీరానందన్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.ఒకసారి ఈ ఫోటోలని మనం పరిశీలించినట్లయితే దాదాపుగా మెగా హీరోల కంటే పొడవుగా ఉన్నట్లు తెలుస్తోంది.

 అయితే ఇందులో ఇప్పటి వరకు మెగా హీరోల్లో ఎత్తు విషయంలో అందరికంటే వరుణ్ తేజ్ ఎక్కువ పొడవుగా  ఉంటాడు.కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ను చూస్తే వరుణ్ తేజ్ కంటే ఎక్కువ పొడవు ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో అకీరా నందన్ ఫోటోలను కొంతమంది నెటిజన్లను బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక హైట్ విషయంలో మెగా హీరోలను మించి పోయావు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో అకీరా నందన్ తన తల్లి రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఓ మరాఠీ చిత్రంలో నటించాడు.దాంతో నటన పరంగా ఓనమాలు దిద్దుకుంటున్నఅఖిరా నందన్ ని ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పరిచయం చేయాలని చూస్తున్నాడట.అంతేకాక ఇప్పటికే టాలీవుడ్లో తమతో సన్నిహితంగా ఉన్నటువంటి ఓ దర్శకుడికి ఈ విషయం గురించి చెప్పడంతో తొందర్లోనే అకీరానందన్ టాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు