బుల్లితెర యాంకర్ గా ఎంతో సక్సెస్ సాధించినటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్( Jabardasth ) తరువాత బుల్లితెరకు దూరమైనటువంటి ఈమె సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో వరుస సినిమాలతో పాటు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో అనసూయ పాల్గొన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చే అనసూయ అప్పుడప్పుడు చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయమైనటువంటి లుక్ లో కనిపిస్తూ ఉంటారు.తాజాగా ఈమె చీర కట్టులో ఎంతో అందంగా ముస్తాబయ్యి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఈ విధంగా చీర కట్టి అందంగా నగలను వేసుకొని ఎంతో ముస్తాబయి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఈమె ఫోటోలపై స్పందిస్తూ మీరు చీరలో చాలా అందంగా ఉంటారు.
ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అంటూ కొందరు కామెంట్లు చేయగా చీరలో ( Saree ) సాంప్రదాయం ఉట్టిపడుతుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అనసూయ.పరిస్థితులు ఎలాంటివైనా ఆనందంగా గడపడం మాత్రం మర్చిపోకండి అంటూ పోస్ట్ చేశారు.ప్రస్తుత ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నారు.ఇక త్వరలోనే పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.