తెలుగు హాట్ యాంకర్ అనసూయ ని ఇలా ఎప్పుడైనా చూశారా....?

టాలీవుడ్ లో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారు ఉండరు.

అయితే ఈమె ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలురకాల షోలకు యాంకర్, జడ్జి గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

అంతేకాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహాయం అందించాలని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తోంది.అయితే యాంకర్ అనసూయ గ్లామర్ కి పెట్టింది పేరు.

 అనసూయ గ్లామర్ తో తెలుగులో పలు స్పెషల్ గీతాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.అయితే ఇటీవలే యాంకర్ అనసూయ మేకప్ లేకుండా దిగినటువంటి ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

దీంతో నెటిజన్లు ఈ ఫోటోలని  తెగ ట్రోల్స్ చేస్తున్నారు.మరికొందరైతే నువ్వు మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా గ్లామర్ క్వీన్ వే అంటూ ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

మరికొందరైతే బ్యూటీ ఇంపార్టెంట్ కాదని ఆమె చేసిన మంచి పనులు హర్షించదగ్గవని కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.

అంతేగాక ఈ అమ్మడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం ఒక పక్క షోలు మరోపక్క సినిమాలు అంటూ నిత్యం బిజీబిజీగా గడుపుతోంది.

Advertisement

తాజా వార్తలు