పూరి సినిమాలో స్టంట్స్ చేయబోతున్న బాలీవుడ్ భామ అనన్య

ఈ మధ్య కాలంలో హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా సినిమాలలో వారి టాలెంట్ చూపిస్తున్నారు.యాక్షన్ సీక్వెన్స్ కూడా కూడా ఇరగదీస్తున్నారు.

యాక్షన్ మూవీస్ కోసం వారి ఫిట్ నెస్, బాడీ షేప్స్ కూడా పెర్ఫెక్ట్ గా మెయింటేన్ చేస్తున్నారు.ఇప్పటికే ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే,కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా లాంటి బాలీవుడ్ భామలు యాక్షన్ మూవీస్ చేసి వారిలోనే యాక్షన్ టాలెంట్ చూపించారు.

ఇప్పుడు మరో అందాల భామ తనలోని యాక్షన్ టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతుంది.ఈ అమ్మడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనన్యా పాండే.

ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా ఫైటర్ మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యంలో ఉండబోతుంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన వాయిదా పెద్ద ఈ సినిమా మరల రీషెడ్యూల్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫైటర్ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అనన్యా పాండే చెప్పుకొచ్చింది.పూరి జగన్నాథ్ సినిమాలో తనకి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని ఈ అమ్మడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.యాక్షన్ సన్నివేశాలలో తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.

కొత్తగా తనని తాను ప్రెజెంట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా అని దీని కోసం త్వరలో బాక్సింగ్ లో కిక్ లు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండలేనని అనన్యా పాండే చెప్పుకొచ్చింది.ఆమె మాటల బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమాలో పూరి అనన్యని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా కాస్తా ప్రాధాన్యత ఉన్నపాత్ర ఇస్తున్నాడని అర్ధమవుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు