ఏపీ మంత్రుల బస్సు యాత్ర ! ఎక్కడి నుంచి ఎక్కడికంటే ?

ప్రస్తుతం జనంలోకి వెళ్లేందుకు రాజకీయ నాయకులంతా పోటీలు పడుతున్నారు.సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ముందుగానే అలెర్ట్అవుతున్నారు.

ఈ విషయంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కూడా ముందుగానే మేల్కొన్నారు.మొన్నటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోయిన జగన్ ఇప్పుడు జనం బాట పడుతున్నారు.

జిల్లాల వారీగా పర్యటిస్తూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించి పార్టీ నాయకులు , అధికారులు జనాల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఎన్నికల వరకు ఇదే విధంగా జనాల్లో ఉండే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.  ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ మంత్రులతో బస్సు యాత్ర చేయించేందుకు జగన్ డిసైడ్ అయిపోయారు.

Advertisement

దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణను సిద్ధం చేశారు.మే 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర చేయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముఖ్యంగా బిసి, ఎస్ టి ,ఎస్సీ, మైనారిటీ మంత్రులతో ఈ బస్సుయాత్ర నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించే విధంగా ప్లాన్ చేశారు. 

ఈ బస్సు యాత్ర కోసం రెండు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.ఈ యాత్ర లో మొత్తం 17 మంది మంత్రులు పాల్గొనబోతున్నట్లు సమాచారం.విశాఖపట్నం నుంచి ప్రారంభమైయ్యే  ఈ బస్సు యాత్ర అనంతపురం లో ముగుస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ముఖ్యమైన పట్టణాలను కవర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.అలాగే మూడు,  నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మంత్రుల బస్సు యాత్రను విజయవంతం చేసే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు,  ఎంపీలు సహకరించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి .ఇక ఎన్నికల వరకు ఇదే విధంగా పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా అంతా జనాల్లో ఉండేలా జగన్ ప్లాన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు