అలా చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది అంటున్న ఆనంద్ మహీంద్ర!

ప్రముఖ వ్యాపార దిగ్గజం, ఎం అండ్​ ఎం ఛైర్మన్ అయినటువంటి ఆనంద్​ మహీంద్ర.ట్విట్టర్​లో ఎల్లపుడూ ఎంతో చురుకుగా ఉంటారు.

తరచూ తన ఫాలోవర్లతో మాటలు కలుపుతారు.ఈ క్రమంలో ఎన్నో విలువైన విషయాలను, వింత అనుభవాలను, ఫన్నీ సంఘటనలను షేర్​ చేస్తూ ఉంటారు.

ఫాలోవర్లు అడిగే కొన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా జవాబులు చెప్పడం ఆనంద్​ మహీంద్రకే చెల్లింది.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

కొత్త స్కార్పియో SUV ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అని ఓ యూజర్​ అడిగిన ప్రశ్నకు ఆనంద్​ మహీంద్ర ఇచ్చిన జవాబు.తాజాగా నెట్టింట్లో వైరల్​గా మారింది.

Advertisement

సదరు యూజర్ ఇలా అడిగాడు.సర్!​ కొత్త స్కార్పియో కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం.

అది ఎప్పుడు విడుదల అవుతుందో కాస్త చెబుతారా? అని ఓ ఫాలోవర్​ ట్వీట్ చేయగా దానికి ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.ష్​ష్​ష్​.

ఆ విషయం నీకు చెబితే, నా ఉద్యోగం ఊడిపోతుంది.కానీ కొత్త స్కార్పియో కోసం నీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను! అని ట్వీట్​ చేశారు.

అయితే ఆనంద్​ మహీంద్ర ఎంతో సమయస్ఫూర్తితో చెప్పిన ఈ జవాబు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఒన్స్ మోర్ నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ కొట్టేనా.? ఒలంపిక్స్ లో నేటి భారత్ ఈవెంట్స్ ఇవే..

ఈ క్రమంలో కొంతమంది మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేది ఎవరు సర్​? అని అడగగా ఇంకొంతమంది ఈ ఇయర్ బెస్ట్​ హ్యూమరస్​ ట్వీట్​ ఇదే అని అంటున్నారు.అలాగే ఇంకొంతమంది స్పందిస్తూ.ఏదిఏమైనా.

Advertisement

మొత్తానికి కొత్త స్కార్పియో లాంచ్​ కోసం మేము ఎదురుచూడక తప్పదు! అని ట్వీట్​ చేస్తున్నారు.ఇకపోతే కొత్త స్కార్పియో లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఎం అండ్​ ఎం ఇంకా బయటపెట్టలేదు.

కాగా.మార్కెట్​లోకి స్కార్పియో అడుగుపెట్టి.

ఈ జూన్​తో దాదాపు 20ఏళ్లు పూర్తవుతాయి.ఇక 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా త్వరలోనే కొత్త స్కార్పియోను ఆ సంస్థ తీసుకురావొచ్చని సమాచారం.

తాజా వార్తలు