వైసీపీ పాలన బ్రహ్మాండంగా ఉందని, ప్రజలు జగన్ పరిపాలన పై సంతృప్తి చెందారని, ఇక రాబోయే ఎన్నికల్లో తమకు తిరుగుండదని ఒకవైపు వైసిపి నాయకులు చెప్పుకుంటూ ఉండగా, జగన్ విధానాలు జనాల్లోకి వెళ్లడం లేదని, ప్రభుత్వ పాలనతో జనాలు విసిగిపోయారని, అనవసరంగా టిడిపి ని ఓడించి తప్పు చేశామనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పదే పదే టిడిపి విమర్శలు చేస్తోంది.అయితే 2019 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభావం బాగానే కనిపించింది.
దీన్ని నిజం చేస్తూ డెమొక్రటిక్ రిఫార్మ్ సర్వే జగన్ ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ జిల్లాల్లో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా జగన్ పరిపాలన పై ప్రజల అభిప్రాయం ఏంటి ? గతంతో పోలిస్తే ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయా లేదా ఇలా అనేక అంశాలపై సర్వే నిర్వహించినట్లు డెమోక్రటిక్ రిఫార్మ్స్ సర్వే సంస్థ తెలిపింది.

వైసిపి ప్రభుత్వ పరిపాలన విధానం పై గ్రామీణ ప్రజల నుంచి పట్టణ నగరాల్లోని పేద దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఎక్కువ సానుకూలత ఉందని తేలిందట.అలాగే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు కారణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు బాగా లబ్ధి పొందుతున్నారని ఈ సర్వేలో తేలింది.అలాగే అమ్మఒడి ఇంటింటికి రేషన్ చేయూత ఇంటింటికి పెన్షన్ వంటి పథకాలు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠలు మరింతగా పెంచిన విషయం ఈ సర్వేలో వెల్లడి అయ్యిందట.ఇంకా ఈ సర్వే పూర్తి కాలేదు.
పూర్తి రిజల్ట్ ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది.ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తో పాటు జనసేన, వామపక్ష కాంగ్రెస్ పార్టీల బలం గతంతో పోలిస్తే ఏమాత్రం పెరగ లేదనే విషయం ఈ సర్వేలో వెల్లడైనట్లు ఆ సంస్థ పేర్కొంది.

ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం తప్ప సీరియస్ గా ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేయడం లేదనే విషయం ఈ సర్వేలో బయటపడింది.టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు ను మాత్రమే అంగీకరిస్తామని, లోకేష్ , బాలయ్య వంటి నాయకులను పెద్దగా గుర్తించం అన్నట్టుగా ప్రజల అభిప్రాయాలు ఉన్నట్లు మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు ఈ సర్వేలో తేలింది.