అమెరికాలో స్వామినారాయణ్‌ ఆలయంపై దాడి..!!!!

అమెరికాలో జాతివిధ్వేషం మరో సారి బయటపడింది.గుర్థూ తెలియని దుండగులు అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ గుడిపై దాడి చేశారు.

అక్కడ ఉన్న విగ్రహాలని ధ్వంసం చేశారు.గోడలని నల్ల రంగుతో నింపారు.

అక్కడ ఉన్న కుర్చీపై కత్తితో గుచ్చి వదిలి వెళ్ళిపోయారు.అక్కడ లూయిస్ విలేలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.

ఈ సంఘటన ఒక్క సారిగా అక్కడ ఉన్న భారతీయులని ఆందోళనకి గురిచేసింది.ఈ దాడిని తీవ్రంగా ఖండించారు భారతీయులు.దాంతో అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.

Advertisement

ఈ దాడి జరగడం భాదాకరమని అన్నారు లూయిస్‌విలె మేయర్‌ గ్రెట్‌ ఫిషర్‌.ఈ రకమైన చర్యలు పిరికిపందలు చేస్తారు అంటూ భారతీయుల మనోభావాలని గౌరవించారు మేయర్ ఫిషర్.

ఇలాంటి చర్యలు జరగడం ఎంతో భాధాకరమని ఆ గుడికి చెందినా రాజ్ పటేల్ తన అభిప్రాయాన్ని తెలిపారు.అయితే అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తకాదు.గతంలో అంటే 2015 ఏప్రిల్‌లో ఉత్తర టెక్సాస్‌లోని ఓ ఆలయాన్ని కూడా ఈ విధంగానే ధ్వంసం చేశారు.

అదే సంవత్సరం ఫిబ్రవరిలోనూ కెంట్‌, సీటెల్‌ మెట్రోపాలిటన్‌లో ఉన్న ఆలయాలపైనా దాడి జరిగింది.అయితే ఈ ఆలాయలపై దాడులు సమంజసం కాదని భారతీయ సంఘాలు అన్నీ ఖండిస్తున్నాయి.

బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు
Advertisement

తాజా వార్తలు