అయ్యో పాపం, అమెరికన్ మహిళను అడవిలోకి తీసుకెళ్లి చైన్‌తో కట్టేశారు!

భారతదేశంలో ఫారినర్లపై జరుగుతున్న నేరాలు పెరుగుతున్నాయి.రేప్‌లు, హత్యలతో పాటు మరింత దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి మరొక ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర రాష్ట్రం,( Maharashtra ) సింధుదుర్గ్ జిల్లా, సోనూర్లి అడవిలో( Sonurli Forest ) ఒక అమెరికన్ మహిళను( American Woman ) ఒక ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టివేశారు.

చాలా రోజులుగా ఆమెను అలాగే కట్టేసి ఉంచారు.ఆ మహిళ సహాయం చేయాలంటూ అరుస్తూ ఎన్నో రోజులు ఆ అడవిలోనే ఆర్తనాదాలు పెట్టింది.

చివరికి కొంతమంది పశువుల కాపరులు ఆమెను గుర్తించారు.ఆహారం లేక బాగా చిక్కిపోయింది.

Advertisement

భారీ వర్షాల కారణంగా ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతిన్నది.ఆ స్థితిలో ఆమెను చూసి పశువుల కాపరులు కంటతడి పెట్టుకున్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక ప్రజల సహాయంతో పోలీసులు ఆ మహిళను ఒరోస్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు, తర్వాత మరింత చికిత్స కోసం గోవాకు( Goa ) తీసుకెళ్లారు.ఆ మహిళ అమెరికాలో జన్మించిందింది.తమిళనాడులో నివసిస్తోంది.

లలిత కాయి కుమార్ ఎస్( Lalita Kayi Kumar S ) అని పేరు పెట్టుకుంది.భారీ వర్షంలో తడవడం వల్ల, ఆహారం లేక చిక్కి పోవడం వల్ల ఆమె ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉంది.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !
సముద్రంలో షిప్పు శిథిలాలు.. అందులో ఏం దొరికిందో తెలిస్తే..?

కొద్దిరోజులు పాటు మెరుగైన వైద్య చికిత్స ఆహారం అందిస్తే ఆమె మాట్లాడే స్థితికి చేరుకోవచ్చు.అప్పుడు అడవిలోకి ఆమెను ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు చెట్టుకి కట్టేశారు? అసలు ఆమెపై ఎవరు ఎందుకు ఇంత పగ పట్టారు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి.

Advertisement

పోలీసులు ఆమె భర్తే ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.ఆమె భర్త కూడా తమిళనాడు వాడే.అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు వెళ్ళాయి.

ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోంది.ఏది ఏమైనా ఈ ఘటన భారతదేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని చాలామంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు