వైరల్ వీడియో: తన ఆల్బం పాటకోసం భారతీయ వంటకాన్ని చేసి అబ్బురపరిచిన అమెరికన్ సింగర్..!

ఫేమస్ అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్‌ జాసన్ డెరు పేరు మీరు వినే ఉంటారు.

అతని పాటలు ఎంత ఫేమస్ గా ఉంటాయో అతను చేసిన వంటకం కూడా ఇప్పుడు అంతే ఫేమస్ అయింది.

అతను వంట చేస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంతకు అతను చేసిన వంటకం ఏంటో తెలిస్తే మీరు కూడా సంతోషిస్తారు.

ఎందుకంటే అది మన ఇండియన్ ఫేమస్ డిష్ కాబట్టి.ఇంతకీ ఏంటి ఆ వంటకం అని అనుకుంటున్నారా.! మనం ఎంతగానో ఇష్టపడే తియ్య తియ్యని జిలేబి’ అండి.

ఇప్పుడు జాసన్ డెరు చేసిన జిలేబి వంటకం ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.జిలేబీ చేస్తున్న వీడియోని మూడు రోజుల క్రితం విడుదల చేయగా ఇప్పటిదాకా ఈ వీడియోకు 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Advertisement

అలాగే షేర్స్ తో పాటు మరెన్నో కామెంట్లు కూడా వచ్చాయి.ఇంకొక విశేషం ఏంటంటే.ఈ వీడియోలో స్వయంగా తాను రాసి, పాడిన జిలేబీ బేబీ సాంగ్‌ ను పాడుతూ మరి జిలేబీని తయారుచేశాడు.

ఆ జిలేబీ పాట ఎంత ఫేమస్ అయిందో మన అందరికి తెలిసిందే.అలాగే ఈ వీడియోలో జిలేబీకి కావలిసిన అన్ని పదార్థాలను సరైన కొలతలతో తీసుకుని మరి జిలేబీని చేసినట్లు తెలిపాడు.

కిచెన్ లో తాను పాడిన పాట బ్యాక్ గ్రౌండ్‌ లో సాంగ్‌ ప్లే చేస్తూ మనదేశపు ఫేమస్ డిష్‌ తయారీలో మునిగిపోయాడు.

అసలు ఇంతకీ అతనికి జిలేబీ మీద మనసు ఎందుకు మళ్లింది అంటే.అతను నివసిస్తున్న ఏరియాలో అక్కడ ఉన్న చాలా మందికి అసలు జిలేబీ అంటే ఏంటో తెలియదంట.జిలేబీ అంటే విచిత్రంగా చూస్తున్నారట.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అందుకోసమే ప్రత్యేకంగా ఈ వంటకాన్ని నేర్చుకుని మరి అతనే స్వయంగా చేసి అక్కడి వారికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ స్వీట్ తయారుచేసినట్లు తెలిపాడు.అలాగే జాసన్ పాడిన జిలేజీ బేబీ సాంగ్‌ ను 2020లో మొదటి సారిగా విడుదల చేశాడు.

Advertisement

అప్పటి నుంచి ఈ పాట ఇప్పటివరకు మీడియాలో ట్రెండింగ్‌ లోనే కొనసాగుతోంది.

ఈ పాటలో వాడిన జిలేబీ అనే పదం అర్ధం తెలుసుకోవడం కోసం జిలేబిని తయారుచేసినట్లు వెల్లడించాడు.జాసన్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు "జిలేబీ అంటే ఏమిటో అని ఆశ్చర్యపోతున్నారా’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చి వీడియోను షేర్ చేశాడు.ఈ వీడియో చూసి నెటిజన్లు తమకి నచ్చినట్లు కామెంట్స్ చేసారు.

కొంత మంది జుల్బియా అంటూ సంబోధించారు.అలాగే ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ ఉపవాసాల్లో భాగంగా మన జిలేబీ అంటే వాళ్ళ భాషలో జుల్బియాను తింటారని కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ఇప్పుడు ఈ జిలేబీ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.అలాగే మన ఇండియన్ వంటకం కూడా ఇతర దేశాల్లో బాగా ఫేమస్ అయిపొయింది మరి.

తాజా వార్తలు