దారుణం : ఒక్కడే 93 మందిని అత్యచారం చేసాడట... చివరికి...

ప్రస్తుత కాలంలో నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు మరియు ఇతర వ్యవస్థలు టెక్నాలజీ బాగానే ఉపయోగిస్తున్నందున తొందరగానే కేసులను ఛేదిస్తున్నారు.

 కానీ 2000 వ సంవత్సరం కంటే ముందు సరైన సదుపాయాలు లేక పలు క్లిష్టమైన కేసుల విచారణలు కొంతమేర ఆలస్యం అయ్యేవి.

 అంతేగాక ఇప్పటి మాదిరిగా అప్పట్లో డిఎన్ఏ టెస్ట్ చేసే సదుపాయం కూడా లేకపోవడంతో నేరస్తులను నిర్ధారించడంలో ఒక్కోసారి పోలీసులు విఫలమయ్యేవాళ్ళు. దీంతో అప్పట్లో ఓ సీరియల్ కిల్లర్ ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని 35 సంవత్సరాల పాటు దాదాపుగా 93 మంది మహిళలను దారుణంగా అత్యాచారం చేసి హతమార్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఓ పట్టణ పరిసర ప్రాంతంలో శామ్యూల్ అనే 70 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం వంటి అలవాట్లకు పూర్తిగా బానిసయి బ్రతుకుతున్నాడు.

ఈ క్రమంలో శామ్యూల్ వేశ్యల వద్దకు వెళ్లి వారిని అనుభవించిన తర్వాత మత్తు మందు పదార్థాలను ఇచ్చి హత్య చేసేవాడు.అంతేకాక అప్పుడప్పుడు మద్యం సేవించినటువంటి మహిళలను కూడా టార్గెట్ చేస్తూ మద్యం సేవించి మత్తులోకి జారుకున్న మహిళలను దారుణంగా అత్యాచారం చేసిన అనంతరం కిరాతకంగా హత్య చేసేవాడు.

Advertisement

 ఆ తర్వాత ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ మృత దేహాలనితీసుకెళ్లి అడవులలో విసిరేసేవాడు.ఇలా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ శామ్యూల్ తన అత్యాచార కాండను కొనసాగించాడు.

 అనంతరం 2005వ సంవత్సరంలో శామ్యూల్ పోలీసుల చేతికి చిక్కాడు. అనంతరం తను చేసినటువంటి నేరాలను పూస గుచ్చినట్లు గా పోలీసుల విచారణలో తెలిపాడు.

 దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించడంతో పాటు అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్ గా  శ్యామ్యూల్ ని ప్రకటించింది.ఏదేమైనప్పటికీ శ్యామ్యూల్ విషయంలో కొంత మేర పోలీసులు సీరియస్ గా తీసుకొని ముందస్తు విచారణ జరిపి ఉంటే కనీసం కొంత మంది మహిళల ప్రాణాలనైనా కాపాడి ఉండే వాళ్ళని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు