American Army: భారత జాతీయ గీతాన్ని వాయించిన యూఎస్ ఆర్మీ బ్యాండ్ .. 2019 నాటి వీడియో, మళ్లీ వైరల్

2019లో భారత జాతీయ గీతాన్ని అమెరికా ఆర్మీ బ్యాండ్ వాయించిన వీడియో మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం.

మెక్‌కార్డ్‌లోని జాయింట్ బేస్ లూయిస్‌లో ‘‘యుధ్ అభ్యాస్’’ ఎక్సర్‌సైజ్‌ సందర్భంగా అమెరికన్ ఆర్మీ బ్యాండ్ ‘‘జన గణ మన’’ను ప్లే చేసింది.2019 సెప్టెంబర్ 5 నుంచి 18 వరకు వాషింగ్టన్‌లో యుద్ అభ్యాస్ జరిగింది.చివరి రోజున యూఎస్ సైన్యం భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది.

ఇది భారత్- అమెరికా మధ్య సంయుక్తంగా నడిచిన అతిపెద్ద సైనిక శిక్షణ, రక్షణ సహకారాల్లో ఒకటి.సదరు వీడియోలో.అమెరికన్ సైనికులు తమ చివరి రోజు ఎక్సర్‌సైజ్‌లో భాగంగా భారతీయ సహచరుల కోసం వారి బాకాలపై జనగణమన ప్లే చేయడం కనిపించింది.

అయితే ఇది 2020లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్ధం నిర్వహించిన ‘‘హౌడీ మోడీ’’ ఈవెంట్‌లోని వీడియో అని చాలా మంది తప్పుగా నివేదించారు.ఈ పోస్టుకు 28.1కే లైక్‌లు, 7,300 రీట్వీట్‌లు వచ్చాయి.మా జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్న ఇతర బ్యాండ్‌ల నుంచి వినడానికి కొత్తగా వుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

ఇకపోతే.భారత్ - అమెరికా మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్‌నాథ్ సింగ్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ల మధ్య చర్చలు ఫలవంతంగా జరిగాయి.

Advertisement

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ పరంగా కీలక ఒప్పందాలు జరిగాయి.దీని ప్రకారం అమెరికా యుద్ధ నౌకల నిర్వహణతో పాటు మరమ్మత్తులు చేసేందుకు భారత షిప్‌ యార్డ్‌లను వినియోగించుకోనున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు