ఒమెక్రాన్ ఎఫెక్ట్...అమెరికా వెళ్లేందుకు రూల్స్ మారిపోయాయ్..!!

అమెరికాను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరుగులు పెట్టిస్తోంది.

నిన్న మొన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఈ తాజా వేరియంట్ ఆందోళనలోకి నెట్టేసింది.

ఇప్పుడిప్పుడే వలస ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారని అనుకున్నంత సేపు పట్టలేదు మరలా ఆంక్షలు విధించడానికి.తాజాగా అమెరికాలో పలు రాష్ట్రాలలో ఈ కేసులు వెలుగు చూడటంతో అమెరికా ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది.

వ్యాక్సిన్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చింది.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.

బూస్టర్ డోస్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.అమెరికా ప్రభుత్వం తాజా పరిస్థితుల నేపథ్యంలో వలసలు వచ్చే వారిపై నిపుణుల సూచనల మేరకు పలు ఆంక్షలు కూడా విధించింది.

Advertisement

విదేశాల నుంచీ అమెరికా వచ్చేవారు గతంలో 72 గంటల ముందు జారీ చేసే కొవిడ్ సర్టిఫికేట్ చూపించాల్సి వచ్చేది, కానీ మారిన రూల్స్ ప్రకారం 24 గంట ముందు జారీ చేసిన కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది.ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అలాగే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వారిని మాత్రం ప్రస్తుతానికి అమెరికాలోకి రానిచ్చేది లేదని ప్రకటించింది.

అయితే ఈ విషయంలో తమ సొంత దేశస్తులకు మాత్రం వెసులుబాటు ఇచ్చింది.అయితే దేశంలోకి వచ్చే వారు ఎయిర్ పోర్ట్ లలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

విమానంలో మాత్రమే కాదు, అమెరికాలో క్యాబ్ లు, బైక్, సొంత వాహనాలు రైళ్ళలో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ఉండాల్సిందేనని ఆదేశించారు.ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు