కరోనా చికిత్సలో అమెరికా ప్రభుత్వానికి సాయం: ఆరోగ్య పరికరాలను సరఫరా చేస్తున్న భారతీయుడు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికాయే.అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ దేశంలో వాస్తవ పరిస్ధితులు ఏమిటో కరోనా కళ్లకుకట్టింది.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.కరోనాను కంట్రోల్ చేయడానికి వైద్యులు, హెల్త్ వర్కర్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు.అయితే అక్కడ వైద్యులను మాస్కులు, పీపీఈ కిట్లు వంటి ఆరోగ్య సంరక్షణ పరికరాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సుధీర్ చైనాని అమెరికా ప్రభుత్వానికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.1990లలో ఆయన తండ్రితో కలిసి సుధీర్ అమెరికన్ డివైసెస్ కంపెనీని స్థాపించారు.ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు వైద్య పరికరాలను ఈ సంస్థ సరఫరా చేసేది.

ఈ కంపెనీని మరొకరికి 2004లో విక్రయించారు.అయితే ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన పాత క్లయింట్లు, స్నేహితులు సుధీర్‌ను కలిశారు.

Advertisement

దేశంలో కోవిడ్ 19 తీవ్రత దృష్ట్యా ఎన్ 95 మాస్కులు, గౌన్లు, పీపీఈ కిట్లు వంటి సామాగ్రిని సరఫరా చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.ఇది సుధీర్‌ను ఆలోచింపజేసింది.గతంలో వ్యాపారం చేసేటప్పుడు పరిచయాలు ఉండటంతో తిరిగి రంగప్రవేశం చేసి, దేశంలోని ఆసుపత్రులకు ఆరోగ్య పరికరాలను సరఫరా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా సుధీర్ న్యూయార్క్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు 1,00,000 హ్యాండ్ శానిటైజర్లను సిద్ధం చేశారు.అమెరికా, భారత్‌లలో ప్రస్తుతం భయానక పరిస్ధితులు ఉండటంతో ప్రజలకు సాయం చేయడానికి ఆహారం, ముసుగులు, నగదు వంటి సామాగ్రితో ఇరు దేశ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని సుధీర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు