‘అమెజాన్‌’కే టోకరా .. ఫిబ్రవరిలో భారతీయుడికి జైలు శిక్ష , ఇప్పుడు నేరాన్ని అంగీకరించిన ఇద్దరు అమెరికన్లు

అమెజాన్ మార్కెట్ ప్లేస్‌ ఫ్లాట్‌ఫామ్‌ను తారుమారు చేస్తూ.మల్టీమిలియన్ డాలర్ల స్కీమ్‌‌కు పాల్పడిన కేసులో ఇద్దరు అమెరికన్ పౌరులు నేరాన్ని అంగీకరించారు.

ఈ కేసులో భారత సంతతికి చెందిన మాజీ ఉద్యోగికి గత ఫిబ్రవరిలో 10 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.అమెజాన్ మార్కెట్ ప్లేస్‌ అనేది సీటెల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అమెజాన్ అనుబంధ ఈ - కామర్స్ ఫ్లాట్‌ఫామ్.

అమెజాన్ ఆఫర్‌లతో పాటు మార్కెట్‌ప్లేస్‌లో కొత్త, పాత ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఇది థర్డ్ పార్టీ విక్రేతలను అనుమతిస్తుంది.ఈ కేసులో ఇప్పటికే ఫిబ్రవరి 11న.కాలిఫోర్నియాలోని నార్త్ రిడ్జ్‌లో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన రోహిత్ కడిమిశెట్టి (28)కి పది నెలల జైలు శిక్ష, 50,000 డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.ఇతను థర్డ్‌ పార్టీ పేరుతో మరో ఐదుగురితో కలిసి భారత్‌లోని అమెజాన్‌ వినియోగదారులను మోసం చేయడంతో పాటు సంస్థ రహస్య సమాచారాన్ని దొంగిలించారని విచారణలో తేలింది.

వీరిలో హైదరాబాద్‌కు చెందిన నిషాద్‌ కుంజు కూడా ఉన్నాడు.ఉద్యోగం నుంచి తొలిగించిన తర్వాత కూడా తాను అమెజాన్‌ ఉద్యోగినేనంటూ.2017 నుంచి అమెజాన్‌ మార్కెట్‌ ప్లేస్‌ను మోసం చేసిన రోహిత్ తన సహచరులతో కలిసి భారీ లబ్ధి పొందారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.మరో ఇద్దరు నిందితులు, అమెరికా పౌరులైన జోసెఫ్ నిల్సెన్ (32), క్రిస్టెన్ లెక్సీ (33)లు సియాటెల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో సోమవారం వివిధ ఆరోపణలపై నేరాన్ని అంగీకరించినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) తెలిపింది.

Advertisement

యూఎస్ అటార్నీ నిక్ బ్రౌన్ ప్రకారం.వైర్ ఫ్రాడ్‌, ట్రావెల్ యాక్ట్‌ను ఉల్లంఘించేలా కుట్ర పన్నినట్లు, తప్పుడు ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేసినట్లు నిల్సెన్ తన నేరాన్ని అంగీకరించాడు.

అమెజాన్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు లంచాలు ఇచ్చి వీరు సంస్థ రహస్యాలను సేకరించినట్లు తేలింది.

విక్రయించిన వస్తువుల భద్రత, ప్రామాణికతను పర్యవేక్షించే అంశంలో జోక్యం చేసుకోవడం, మార్కెట్‌ప్లేస్‌లో పోస్ట్ చేయబడిన సమాచారం ఖచ్చితత్వాన్ని దెబ్బతీసినట్లు న్యాయశాఖ పేర్కొంది.మరో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన నిషాద్‌ కుంజుపై విచారణ జరగాల్సి ఉండడంతో ఆయనపై అభియోగపత్రం నమోదు చేయలేదని ఎఫ్‌బీఐ తెలిపింది.ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (ఐఆర్ఎస్- సీఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సహాయంతో ఎఫ్‌బీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఇక.ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకే చెందిన ఎఫెరైమ్‌ రోసెన్‌బెర్గ్‌, హడిస్‌ న్యుహనోవిక్‌‌ల విచారణ అక్టోబర్ 2022లో జరగనుంది.అమెరికా చట్టాల ప్రకారం.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ట్రావెల్ యాక్ట్‌ను ఉల్లంఘించేందుకు కుట్ర చేస్తే ఐదేళ్లు, వైర్ ఫ్రాడ్‌కు కుట్ర పన్నితే 20 ఏళ్లు, తప్పుడు ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

Advertisement

తాజా వార్తలు