Navel Therapy : రోజూ నైట్ నాభికి నూనె రాయ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత లాభాలు పొందవ‌చ్చో తెలుసా?

నాభి మాన‌వ‌ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. బెల్లీ బటన్(బొడ్డు)( Belly Button ) శరీరంలోని వివిధ సిరలతో అనుసంధానించబడింది.

అందువ‌ల్ల నాభికి రోజూ రాత్రిపూట నూనె రాసి మసాజ్ చేయ‌డం వ‌ల్ల‌ ఎన్నో అద్భుత లాభాల‌ను పొందుతారు.నాభికి నూనెతో మ‌సాజ్ చేయ‌డాన్ని నావల్ థెరపీ అంటారు.

ఈ థెర‌పీతో అనేక అనారోగ్యాలు నయం అవుతాయని వైద్యపరంగా నిరూపించబడింది.ఈ నేప‌థ్యంలోనే నాభికి నూనె రాయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవ‌ల కాలంలో చాలా మంది కీళ్ల‌ నొప్పులు, కండరాల నొప్పులతో బాధ‌ప‌డుతున్నారు.అలాంటి వారు రోజూ నైట్ నాభికి ఆవ నూనెతో మ‌సాజ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పు( Joint Pain )ల నుంచి ఉపశమనం పొందుతార‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అలాగే బెల్లీ బటన్ యొక్క కేంద్రం కేంద్ర నాడీ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుంది.అందువల్ల‌ నూనెతో మసాజ్ నిత్యం మ‌సాజ్ చేస్తే మెద‌డు, మ‌న‌సు ప్ర‌శాంతంగా మార‌తాయి.మానసిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

నాభిపై గోరువెచ్చని ఆవాల నూనె( Mustard oil) లేదా అల్లం నూనెను క్రమం తప్పకుండా పూయడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ మెరుగుప‌డుతుంది.పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం అవుతుంది.మ‌రియు ఆడవారిలో సంతానోత్పత్తిని పెరుగుతుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

అంతేకాకుండా రోజూ నైట్ నాభికి నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ సామర్థ్యం పెరుగుతుంది.గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, మలబద్ధకం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

Advertisement

పేగుల్లోని అవాంఛిత బ్యాక్టీరియా తొలగిపోతుంది.ముఖం చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

పిగ్మెంటేష‌న్ స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు స్త్రీలు ఈ నావ‌ల్ థెరపీతో రుతుస్రావం సమయంలో తిమ్మిరి మరియు నొప్పిని తగ్గించవచ్చు.

తాజా వార్తలు