కురులకు కొండంత అండగా నిలిచే కుంకుడు కాయలు.. ఇలా వాడితే అదిరిపోయే లాభాలు!

ఇప్పుడంటే హెయిర్ వాష్( Hair Wash ) చేసుకోవడానికి రకరకాల షాంపూలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వేలల్లో కాదు లక్షలు ఖరీదు చేసే షాంపూలను కూడా తీసుకొస్తున్నారు.

కానీ ఒకప్పుడు అందరూ జుట్టును శుభ్రం చేసుకునేందుకు కుంకుడు కాయల్ని వాడేవారు.కుంకుడు కాయల్లో( Soap Nuts ) యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

అందువల్ల కురుల ఆరోగ్యానికి కుంకుడు కాయలు కొండంత అండగా నిలుస్తాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కుంకుడు కాయలను వాడితే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.మనలో చాలా మంది హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు రెండు గ్లాసుల కుంకుడు రసంలో రెండు టేబుల్ స్పూన్లు మెంతి పిండి( Fenugreek Powder ) వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.

Advertisement

ఆ తర్వాత ఈ కుంకుడు రసాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా తలస్నానం చేస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు విరగడం చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

అలాగే చుండ్రు సమస్యతో( Dandruff ) బాధపడుతున్న వారికి కుంకుడు కాయలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.కుంకుడు కాయలతో చాలా అంటే చాలా సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు.అందుకోసం కుంకుడు కాయల రసంలో మెత్తగా నూరిన నాలుగు మందార ఆకులు( Hibiscus Leaves ) వేసి కలపాలి.

ఇప్పుడు ఈ కుంకుడు రసంతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.కుంకుడు కాయలు మరియు మందారం కాంబినేషన్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా చుండ్రు మొత్తాన్ని సులభంగా తొలగిస్తుంది.

చిరంజీవి పాటలకు విరాట్ కొహ్లీ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడా.. అసలేం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేయండి గురువు గారు !

స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తుంది.కాబట్టి ఇకపై వేలకు వేలు షాంపూల కోసం తగలేయడం మానేసి కుంకుడు కాయలతో తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి.

Advertisement

ఆరోగ్యమైన కురులను మీ సొంతం చేసుకోండి.

తాజా వార్తలు