పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి అమలాపాల్.. కొడుకు పేరు ఏంటో తెలుసా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన వారిలో నటి అమలాపాల్( Amala Paul ) ఒకరు.

ఈమె పలు తెలుగు తమిళ మలయాళ భాష చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడితో ప్రేమలో పడటం అనంతరం ఆయనని పెళ్లి చేసుకొని కొద్ది రోజులకు విడాకులు తీసుకొని విడిపోవటం జరిగింది.ఇలా తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలపై ఫోకస్ చేసిన అమలాపాల్ తిరిగి ప్రేమలో పడ్డారు.

ఈమె జగత్ దేశాయ్( Jagath Desai ) అనే వ్యాపారవేత్త ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో పడిన ఈమె తన ప్రేమ విషయాన్ని బయటకు తెలియజేయకుండా రహస్యంగా ఉంచారు అయితే తన ప్రియుడిని పరిచయం చేసిన 15 రోజులలోనే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే గత ఏడాది నవంబర్ 5వ తేదీ ఎంతో ఘనంగా తన ప్రియుడిని పెళ్లాడిన ఈమె పెళ్లయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

అమలాపాల్ ప్రెగ్నెన్సీ సమయంలో తన బేబీ బంప్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు.ఇకపోతే తాజాగా అమలాపాల్ పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.ఈమె ఈనెల 11వ తేదీనే బాబుకు జన్మనిచ్చినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు.ఇందులో బాబు ఫేస్ చూపించకపోయిన ఈమె హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు తనకు ఘన స్వాగతం పలికారు.

ఇల్లు మొత్తం డెకరేట్ చేసి తమ బాబుని ఇన్వైట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక తనకు కొడుకు పుట్టారు అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కుమారుడికి ఇలాయ్( Ilai ) అనే నామకరణం చేసినట్లు కూడా అమలాపాల్ తెలియజేయడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు