బ్ర‌హ్మానందానికి బ్యాడ్ టైం స్టార్ట్...

వెయ్యికి పైగా సినిమాల్లో న‌టించి త‌న కామెడితో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌టించిన స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేయాల్సిన ప‌నిలేదు.

ఒక‌ప్పుడు ఆయ‌న లేని సినిమా లేదు.

హీరో క్యారెక్ట‌ర్‌ను కూడా ఆయ‌న క్యారెక్ట‌ర్ డామినేట్ చేసేలా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు క్యారెక్ట‌ర్స్ క్రియేట్ చేశారు.అయితే బ్ర‌హ్మానందం డేట్స్ దొర‌క‌క‌పోవ‌డం, సెట్స్‌లో బ్ర‌హ్మానందంను హ్యండిల్ చేయ‌డం క‌ష్ట‌మ‌వ‌డం వంటి వార్త‌లు కూడా చాలానే వ‌చ్చాయి.

దాంతో ఇప్పుడు ద‌ర్శ‌కులు, ర‌చ‌యితలు బ్ర‌హ్మానందంకు క్యారెక్ట‌ర్ క్రియేట్ చేయ‌డం లేదు.ఒక‌వేళ ఉన్నా అంత‌గా ప్రాముఖ్య‌త‌ను ఇవ్వ‌డం లేదు.

మరి వీరికి దొరికిన అల్ట‌ర్‌నేటివ్ న‌టుడు ఎవ‌రు.ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ష‌క‌ల‌క శంక‌ర్‌, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్ వంటి యంగ్ క‌మెడియ‌న్స్ రావ‌డం సునీల్ త‌న‌కు తాను త‌ప్పుకుని హీరోగా సెటిల్ అయిపోవ‌డంతో క‌చ్చితంగా అల్ట‌ర్ నేటివ్ అవ‌స‌రం అయింది.

Advertisement

ప్ర‌స్తుతం అంద‌రికీ అందుబాటులో బ్ర‌హ్మీకి అల్ట‌ర్‌నేటివ్‌గా త‌యారైన న‌టుడు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ.చాలా వ‌ర‌కు సినిమాల్లో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ.

అంటూ సంద‌డి చేసిన పృథ్వీకి ఇప్పుడు మంచి రోల్స్ వ‌స్తున్నాయి.జేమ్స్ బాండ్‌, లౌక్యం ఇలా ఒక‌టేమిటి ఇప్పుడు వ‌స్తున్న సినిమాల్లో ర‌చ‌యిత‌లు పృథ్వీకి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు క్రియేట్ చేస్తున్నారు.

సాధార‌ణంగా బ్ర‌హ్మానందం కోసం ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన కోన‌వెంక‌ట్ సైతం శంక‌రాభ‌ర‌ణంలో బ్ర‌హ్మీ క్యారెక్ట‌ర్‌ను పృథ్వీతో చేయించాడు.ప‌ర్సంటేజ్ ప‌ర‌మేశ్వ‌ర్ అంటూ సాగే పాత్ర‌లో పృథ్వీ కామెడి టైమింగ్ అదిరిపోవ‌డంతో పృథ్వీకి మ‌రిన్ని మంచి రోల్స్ వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా క‌న‌ప‌డుతున్నాయి.

మొత్తం మీద బ్ర‌హ్మానందంకు అల్ట‌ర్ నేటివ్ న‌టుడు దొరికేశాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు