పుష్ప కోసం దిశానే కావాలంటున్న అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప.ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా మెజారిటీ కథ మొత్తం నడుస్తుంది.మొదటి సారి ఈ మూవీ కోసం అల్లు అర్జున్ పక్క మాస్ రోల్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.ఇక పుష్ప సినిమాని రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.

కంటెంట్ ఎక్కువగా ఉండటంతో పాటు ఎక్కడ కూడా కట్ చేయడానికి స్కోప్ లేకపోవడం వలెనే రెండు భాగాలుగా మూవీని తీసుకురావాలని సుకుమార్ భావిస్తున్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సుకుమార్ గత చిత్రాల మాదిరిగానే అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఒకటి రాయలసీమ ఫోక్ స్టైల్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే ఈ సాంగ్ కోసం దేవిశ్రీ ట్యూన్ కూడా కంపోజ్ చేసి రెడీగా ఉంచినట్లు తెలుస్తుంది.ఇక ఈ సాంగ్ కోసం సుకుమార్ మొదటి నుంచి ఎవరైనా సౌత్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు.

అలాగే ఊర్వశీ రోతేలా పేరు కూడా తెరపైకి వచ్చింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ దిశా పటానీ పేరుని రిఫర్ చేసినట్లు తెలుస్తుంది.

సల్మాన్ ఖాన్ రాధే సినిమాలో సిటీమార్ సాంగ్ కి దిశా వేసిన స్టెప్పులు అల్లు అర్జున్ కి విపరీతంగా నచ్చేశాయని టాక్.ఇక దిశా పటానీ కూడా అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అని పేర్కొంది.

ఈ నేపధ్యంలో దిశా పటాని ఐటెమ్ సాంగ్ కోసం తీసుకుంటే సినిమాకి కూడా ప్లస్ అవుతుందని బన్నీ ఆమెని సూచించినట్లు బోగట్టా.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు