ఈ ఏడాది ఆరంభం నుండి ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా ప్రారంభ కార్యక్రమం నేడు లాంచనంగా జరిగింది.పుష్ప 2 సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఇన్నాళ్లు వెయిట్ చేసి ఎందుకు అల్లు అర్జున్ లేని సమయంలో నే పుష్ప 2 సినిమా యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు.ఈ సినిమా లో అల్లు అర్జున్ మాస్ యాంగిల్ విశ్వరూపం చూపించబోతున్నట్లుగా సుకుమార్ చెబుతున్నారు.
బన్నీ కూడా సినిమా యొక్క పూజా కార్యక్రమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.అమెరికాలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను బన్నీ వెళ్లాడు.ఈ స మయంలోనే పుష్ప 2 యొక్క కార్యక్రమం జరగడం వెనుక ఉద్దేశ్యం ఏమీ లేదని.మంచి రోజు అనే ఉద్దేశ్యం మాత్రమే పుష్ప 2 ను బన్నీ లేని సమయంలో చేయడం జరిగింది.
అంతే తప్ప మరే ఉద్దేశ్యం లేదు అంటున్నారు.
మరో వారం రోజులు అయితే మంచి రోజులు లేకుండా పోతాయి.
అందుకే మూడాల్లో సినిమా ను ప్రారంభించడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు హడావుడిగా చేశాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు.

అల్లు అర్జున్ వచ్చిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవ్వడం వల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ఆ వెంటనే సినిమా ను పూర్తి చేస్తారేమో చూడాలి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.